NRI-NRT

NATS.ప్రాచీన సాహిత్యంలో ఆధునిక దృక్పథంపై వెబినార్

NATS.ప్రాచీన సాహిత్యంలో ఆధునిక దృక్పథంపై వెబినార్

ప్రాచీన సాహిత్యంలో ఆధునిక దృక్పథంపై నాట్స్ వెబినార్
సాహిత్యంలో శాస్త్రీయ అంశాలను వివరించిన కప్పగంతు రామకృష్ణ
అంతర్జాలం: ఏప్రిల్ 16: తెలుగు భాష గొప్పదనం గురించి అంతర్జాలంలో సదస్సులు నిర్వహిస్తున్న ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్ తాజాగా ప్రాచీన సాహిత్యంలో ఆధునిక దృక్పథంపై వెబినార్ నిర్వహించింది. ప్రాచీన సాహిత్యంలోని శాస్త్రీయమైన అంశాలను ప్రముఖ రచయిత, అధ్యాపకులు, తెలుగు అకాడమి సభ్యులైన డాక్టర్ కప్పగంతు రామకృష్ణ వివరించారు. మహాభారత కావ్యంలో నేటికి పనికి వచ్చే ఆధునిక అంశాలు చాలా ఉన్నాయన్నారు. ఆ అంశాలను విడమరిచి చెప్పారు.. భాగవతంలో శ్రీ కృష్ణుడు పర్యావరణ పరిరక్షణ అనేది ఎలా చేశారు..? అనేది కప్పగంతు రామకృష్ణ తెలిపారు. ప్రాచీన సాహిత్యాన్ని మనం చూసే దృష్టి కోణం మార్చుకుంటే ఎన్నో అద్భుతమైన విషయాలను తెలుసుకోవచ్చని.. వాటిని నేటి సమాజానికి అన్వయించుకోవచ్చని తెలిపారు. సమాజంలో యువత పెడదోవ పెట్టకుండా ఉండాలంటే ప్రాచీన సాహిత్యాన్ని సరైన కోణంలో అధ్యయనం చేయాలని సూచించారు. మహాభారతం చదివితే అది వ్యక్తిత్వ వికాసానికి బాటలు వేస్తుందని కప్పగంతు రామకృష్ణ అన్నారు. తెలుగు భాష మాధుర్యాన్ని తెలుగువారికి గుర్తు చేసేందుకు నాట్స్ తన వంతు కృషి ఎప్పుడూ చేస్తుంటుందని నాట్స్ చైర్ విమెన్ అరుణ గంటి అన్నారు. నాట్స్ లలితా కళా వేదిక ద్వారా తెలుగు భాష ప్రత్యేకత ఏమిటినేది నేటితరం.. రేపటి తరం తెలుసుకునేలా నాట్స్ సదస్సులు నిర్వహిస్తుందని నాట్స్ అధ్యక్షులు బాపయ్య చౌదరి (బాపు)నూతి తెలిపారు. ఈ సదస్సుకు వ్యాఖ్యాతలుగా నాట్స్ నాయకులు శాయి ప్రభాకర్ యఱ్ఱాప్రగడ, మురళీకృష్ణ మేడిచెర్ల వ్యవహరించారు.

NATS Salesforce Admin Training Press Note:
నాట్స్ స్టూడెంట్ కెరీర్ డెవలప్ మెంట్ ఫోరమ్ ఆధ్వర్యంలో జరిగిన సేల్స్ ఫోర్స్ అడ్మిన్ శిక్షణ తరగతులకు విద్యార్థుల నుండి మంచి స్పందన రావటమేకాక, శిక్షణ తరగతులు చాలా చక్కగా జరిగాయి. ఈ శిక్షణ తరగతులను మంచి అనుభవం ఉన్న సీనియర్ సేల్స్ ఫోర్స్ ఆర్కిటెక్ట్స్ అడీల్ అబ్బాసీ మరియు కృష్ణ తుమ్మలపల్లిల ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది.

ఈ శిక్షణ ద్వారా అనేక మంది విద్యార్థులు, కెరీర్ మార్చుకోవాలనుకునే వృత్తి నిపుణులు ప్రయోజనం పొందారు. అంతేకాక, ఈ శిక్షణా కార్యక్రమం ద్వారా వచ్చిన $2,600 మొత్తాన్ని “నాట్స్ స్టూడెంట్ స్కాలర్షిప్ ప్రోగ్రాం”కు అందించడం జరుగుతుందని నాట్స్ అధ్యక్షులు బాపు నూతి గారు ఈ సందర్భంగా తెలియచేసారు. ఈ సందర్భంగా ఈ కార్యక్రమానికి సమన్వయకర్తలైన శ్రీధర్ న్యాలమడుగుల, D V ప్రసాద్, రాజేష్ కాండ్రు, శ్రీనివాస్ చిలుకూరి, రామకృష్ణ బాలినేని, రంజిత్ చాగంటి, హరినాథ్ బుంగతావులను ప్రత్యేకంగా అభినందించారు.

ఇంకా, ఈ నాట్స్ స్టూడెంట్ కెరీర్ డెవలప్ మెంట్ ఫోరమ్ ద్వారా ప్రతి త్రైమాసికంలో ఒక అడ్వాన్స్డ్ టెక్నాలజీస్ మీద ముఖ్యంగా విద్యార్థుల కెరీర్ కు ఉపయోగపడే విధంగా నూతన టెక్నాలజీస్ మీద శిక్షణా తరగతులను మరియు కెరీర్ డెవలప్ మెంట్ కార్యక్రమాలను రూపొందించటం జరుగుతుందని నాట్స్ అధ్యక్షులు బాపు నూతి తెలిపారు. ఈ సందర్భంగా ఎవరైనా “నాట్స్ స్టూడెంట్ స్కాలర్షిప్ ప్రోగ్రాం” లో పాలుపంచుకోవాలనుకొనే దాతలు క్రింద ఇచ్చిన నాట్స్ వెబ్ సైట్ లింక్ ద్వారా విరాళాలు ఆందించవచ్చు.

ఇలాంటి మంచి కార్యక్రమాన్ని రూపకల్పన చేసి, గత ఐదు వారాలుగా విజయవంతంగా నిర్వహించిన కార్యకర్తలకు నాట్స్ చైర్ వుమన్ అరుణ గంటి గారు ప్రత్యేక అభినందనలు తెలియ చేశారు.