శ్రీశైల మహాక్షేత్రంలో శిఖరానికి 18 కిలోమీటర్ల దూరంలో రమణీయమైన పచ్చని అడవుల మధ్య ఈ అమ్మవారి ఆలయం ఉంటుంది,
అమ్మవారు ఇక్కడ భూగృహంలో ఉన్న మాదిరిగా భూమట్టం నుండి లోపలకు ఉంటారు,
అమ్మవారి ఆలయం పక్కన గణపతి, శివలింగం, పలురకాల పరివార దేవతలు ఉంటారు,
అమ్మ ఇక్కడ నాలుగు హస్తములు కలిగి ద్యానముద్రలో ఒక్కో చేతిలో శివలింగము, జపమాల, తామరపువ్వు, శంఖము కలిగి లింగధారియై ఉంటారు,
ఇక్కడ మనం అమ్మవారికి నుదుట కుంకుమ పెడితే ఆమె ఫాలభాగం మెత్తగా శరీర స్పర్శ తెలుస్తుంది,
అమ్మ ఆజ్ఞ రానిదే ఇక్కడకు చేరుకోవడం అసాధ్యము, ప్రతిరోజూ ఇక్కడ ఉన్న చెంచులు వచ్చే భక్తులకు నిత్యాన్న సంతర్పణ చేస్తారు,
ఎలా చేరుకోవాలి:
శ్రీశైలం వచ్చే భక్తులు ఉదయం 6 లోపు తమ ఆధార్ కార్డుతో శిఖరం చేరుకుంటే మన వివరాలు నమోదు చేసుకుని అటవీశాఖ వారి జీపులలో తీసుకెళ్లి దర్శనం చేయించి తిరిగి శిఖరం వద్ద దింపుతారు,
ఒక్కొకరికి పోనూరాను కలిపి 1000 తీసుకుంటారు,
శ్రీశైల వచ్చిన భక్తులు వీలైతే అమ్మవారి దర్శనం చేసుకుని ఆమె అనుగ్రహం పొందగలరు..