Business

స్టాక్ మార్కెట్ల తొమ్మిది రోజుల నష్టాలకు బ్రేక్.. కుప్పకూలిన ఇన్ఫోసిస్ షేర్లు

స్టాక్ మార్కెట్ల తొమ్మిది రోజుల నష్టాలకు బ్రేక్.. కుప్పకూలిన ఇన్ఫోసిస్ షేర్లు

520 పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్, 121 పాయింట్లు కోల్పోయిన నిఫ్టీ, 9.40 శాతం పతనమైన ఇన్ఫోసిస్ షేర్లు.

దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు భారీగా నష్టపోయాయి. ట్రేడింగ్ ప్రారంభమైనప్పటి నుంచి చివరి వరకు మార్కెట్లకు కొనుగోళ్ల మద్దతు లభించలేదు. దీంతో తొమ్మిది రోజుల వరుస లాభాలకు ఈరోజు బ్రేక్ పడినట్టయింది. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి 520 పాయింట్లు నష్టపోయి 59,910కి పడిపోయింది. నిఫ్టీ 121 పాయింట్లు కోల్పోయి 17,706కి దిగజారింది. దేశీయ టెక్ దిగ్గజం ఇన్ఫోసిస్ 9.40 శాతం పతనమయింది.

బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
నెస్లే ఇండియా (4.03%), పవర్ గ్రిడ్ కార్పొరేషన్ (2.14%), స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (2.04%), కోటక్ బ్యాంక్ (1.45%), ఇండస్ ఇండ్ బ్యాంక్ (1.37%).

టాప్ లూజర్స్:
ఇన్ఫోసిస్ (-9.40%), టెక్ మహీంద్రా (-5.25%), హెచ్సీఎల్ టెక్నాలజీస్ (-2.72%), ఎన్టీపీసీ (-2.02%), ఎల్ అండ్ టీ (-1.98%).
[6:16 pm, 17/04/2023] Tihi Sk: Hdh