Devotional

అందుబాటులోకి అన్నవరం దేవస్థానం ఆన్‌లైన్ సేవలు

అందుబాటులోకి అన్నవరం దేవస్థానం ఆన్‌లైన్ సేవలు

స్వామి వారి ప్రత్యక్ష, పరోక్ష సేవల టికెట్లను ముందుగానే బుక్ చేసుకునే వెసులుబాటు.

వసతి గదులు, కల్యాణ మండపాల బుకింగ్ కూడా

అన్నవరం సత్యనారాయణస్వామి దేవస్థానం ఆన్‌లైన్ సేవలు ప్రారంభించింది. వీటి ద్వారా భక్తులు స్వామి వారి ప్రత్యక్ష, పరోక్ష సేవలు అంటే.. వ్రతాలు, కల్యాణాలు, హోమాలు, ఇతర పూజలు, దర్శనాలు, ప్రసాదం, కల్యాణకట్ట, అన్నదానం టికెట్లు, వసతి గదులు, కల్యాణ మండపాల బుకింగ్ వంటి వాటిని ముందుగానే చేసుకోవచ్చు.

ఇందుకోసం http//www.aptemples.ap.gov.in వెబ్‌సైట్‌లోకి వెళ్లాలి. అక్కడ అన్నవరం దేవస్థానాన్ని ఎంపిక చేసుకుని ఫోన్ నంబరు ద్వారా లాగిన్ కావాల్సి ఉంటుంది. అనంతరం కావాల్సిన సేవను ఎంచుకుని బుక్ చేసుకోవచ్చు.