గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో చేస్తోన్న సినిమా గేమ్ చేంజర్. ఈ మూవీ షూటింగ్ దశలో ఉంది. దిల్ రాజు నిర్మాణంలో తెరకెక్కుతోన్న ఈ సినిమా కోసం 200 కోట్ల వరకు ఖర్చు పెడుతున్నారు. ఇదిలా ఉంటే ఈ మూవీకి సంబందించిన ఫస్ట్ లుక్ ని రామ్ చరణ్ పుట్టిన రోజు సందర్భంగా రిలీజ్ చేశారు.
టైటిల్ ని కూడా ఎనౌన్స్ చేశారు. దర్శకుడు శంకర్ ఓ వైపు రామ్ చరణ్ తో గేమ్ చేంజర్ మూవీ చేస్తూనే మరో వైపు కమల్ హసన్ హీరోగా ఇండియన్ 2 మూవీ కూడా చేస్తున్నారు. ఈ రెండు కూడా పాన్ ఇండియా సినిమాలే కావడం విశేషం. రెండింటిని ని ఒకదాని తర్వాత ఒకటిగా షూటింగ్ చేసుకుంటూ శంకర్ పూర్తి చేసే ప్రయత్నంలో ఉన్నారు.
ఇండియన్ 2 షూటింగ్ షెడ్యూల్ పూర్తి కావడంతో మరల రామ్ చరణ్ గేమ్ చేంజర్ మూవీ సెట్స్ లోకి శంకర్ అడుగుపెట్టారు. దీనిపై తాజాగా ట్విట్టర్ లో క్లారిటీ ఇచ్చారు. గేమ్ చేంజర్ క్లైమాక్స్ షెడ్యూల్ షూటింగ్ స్టార్ట్ చేసినట్లు పేర్కొన్నారు. ఈ షెడ్యూల్ లో కీలకమైన యాక్షన్ సీక్వెన్స్ ని చిత్రీకరించబోతున్నట్లు ట్విట్టర్ లో పేర్కొన్నారు. అలాగే ఈ మూవీ షెడ్యూల్ ఏప్రిల్ ఆఖరు వరకు ఉండనుంది. మే నెలలో మరల ఇండియన్ 2 మూవీ షూటింగ్ స్టార్ట్ చేస్తానని చెప్పారు. ఈ నేపధ్యం గేమ్ చేంజర్ మూవీ షూటింగ్ కి ఈ షెడ్యూల్ లో శంకర్ ప్యాకప్ చెప్పెస్తున్నారనే మాట వినిపిస్తోంది. ఇక మూవీ షూటింగ్ కంప్లీట్ అయితే మాత్రం దిల్ రాజు ఇక మూవీ రిలీజ్ పై ప్లాన్ చేసుకునే అవకాశం ఉందని చెప్పాలి. సినిమా షూటింగ్ కంప్లీట్ అయిన తర్వాత రిలీజ్ డేట్ గురించి క్లారిటీ ఇస్తామని ఇప్పటికే దిల్ రాజు ప్రకటించారు. మరి దీనిపై చిత్ర యూనిట్ నుంచి ఏమైనా ప్రకటన వస్తుందా అనేది వేచి చూడాలి.