చంద్రబాబు నాయుడు జన్మదినం సందర్భంగా మన్నవ మోహన కృష్ణ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలోని వేలమంది ముస్లిం సోదరులకు ఇఫ్తార్ ఏర్పాటు
తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు జన్మదినాన్ని పురస్కరించుకొని గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలోని వేలాది మంది ముస్లిం సోదరులకు ఇఫ్తార్ విందును తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి, ఎన్టీఆర్ ట్రస్ట్ డైరెక్టర్, గుంటూరు పశ్చిమ నియోజకవర్గ టీడీపీ నాయకులు మన్నవ మోహన కృష్ణ ఏర్పాటు చేసారు. చంద్రబాబు నాయుడు జన్మదినానికి గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలోని వేలాది మంది ముస్లిం సోదరులకు మన్నవ మోహన కృష్ణ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఇఫ్తార్ విందు ఏర్పాటు చేసి నారా చంద్రబాబు నాయుడు గారి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా మన్నవ మోహన కృష్ణ మాట్లాడుతూ నారా చంద్రబాబు నాయుడు జన్మదినం సందర్భంగా ఉపవాసదీక్షలో పాల్గొన్న ముస్లిం సోదరులకు ఇఫ్తార్ విందును ఇవ్వడం నా అదృష్టంగా భావిస్తున్నానని, నిరంతరం ప్రజా సంక్షేమం కోసం, ఆంధ్ర రాష్ట్ర భవిత కోసం, 73 ఏళ్ళ వయస్సులో అలుపెరుగని కృషి చేస్తున్న నిత్య శ్రామికుడు, భావితరాల భవిష్యత్తు కోసం అహర్నిశలు కష్టపడుతున్న చంద్రబాబు నాయుడు గారికి జన్మదిన శుభాకాంక్షలను తెలియచేసి అల్లాహ్ చల్లగా చూడాలని, ఈ పవిత్ర రంజాన్ మాసంలో రాష్ట్రంలోని ప్రతి ఒక్కరికి మంచి జరగాలని మోహన కృష్ణ ఆకాంక్షించారు.