బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ నటించిన కిసి కా భాయ్ కిసీ కి జాన్ చిత్రం ప్రపంచవ్యాప్తంగా విడుదలకు సిద్దమైంది. తమిళంలో విజయవంతమైన వీరమ్ (తెలుగులో కాటమరాయుడు) సినిమాకు రీమేక్‌గా రూపొందిన ఈ చిత్రంలో వెంకటేష్ ప్రధాన పాత్రలో నటిస్తున్నారు.
పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రంలో రాంచరణ్ ఓ పాటలో స్పెషల్ అప్పీయిరెన్స్ ఇవ్వబోతున్నారు. ఈ సినిమా గురించి దుబాయ్‌కి చెందిన ఉమేర్ సంధూ ట్విట్టర్‌లో ఈ సినిమా రివ్యూ రాశారు. ఆ రివ్యూ వివరాల్లోకి వెళితే..
సల్మాన్ గత చిత్రాలు: గతంలో సల్మాన్ ఖాన్ నటించిన చిత్రాలు బాక్సాఫీస్ వద్ద పెద్దగా కలెక్షన్లు రాబట్టలేకపోయాయి. లాక్‌డౌన్ తర్వాత సల్మాన్ నటించిన గత చిత్రం నేరుగా ఓటీటీలో రిలీజైంది. అయితే ఆ చిత్రం కూడా పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. దాంతో కిసీ కా భాయ్, కిసీ కి జాన్ చిత్రంపై భారీ అశలు పెట్టుకొన్నారు. ఈ సినిమాతో సౌత్‌ను కూడా టార్గెట్ చేయడంతో ఆసక్తిగా మారింది.
ఓ మోస్తారుగా అడ్వాన్స్ బుకింగ్: సల్మాన్ ఖాన్ తాజా చిత్రం కిసీ కా భాయ్, కిసీ కి జాన్ బజ్ క్రియేట్ చేయలేదనే విషయం అడ్వాన్స్ బుకింగ్‌తో స్పష్టమైంది. గత చిత్రాలతో పోల్చితే ఈ సినిమా కలెక్షన్ల విషయంలో వెనుకబడినట్టు కనిపిస్తున్నది. అయితే సల్మాన్ ఖాన్ ఈ ప్రతికూల పరిస్థితులను ఎదురిస్తుందా అనేది ఇప్పుడు బాలీవుడ్‌లో చర్చనీయాంశమైంది.
ఉమేర్ సంధూ ట్వీట్‌తో: కిసీ కా భాయ్, కిసీ కి జాన్ చిత్రం ప్రతికూల పరిస్థితుల మధ్య ప్రేక్షకుల ముందుకు వస్తున్న నేపథ్యంలో ఉమేర్ సంధూ చేసిన ట్వీట్ ఫ్యాన్స్‌ను ఆందోళనకు గురిచేస్తున్నది. ఈ సినిమాను సెన్సార్ స్క్రీనింగ్‌లో చూశాను. ఈ సినిమా చూసిన తర్వాత ఈ గ్రహాన్ని విడిచిపారిపోవాలని అనుకొన్నాను. తలనొప్పికి పారాసిటామోల్ వేసుకోవాలన్నంత బాధ కలిగింది అంటూ ట్వీట్ చేశారు.
రెస్పాన్స్ కరువైన అడ్వాన్స్ బుకింగ్: కిసీ కా భాయ్, కిసీ కి జాన్ అడ్వాన్స్ బుకింగ్ పరిస్థితి డిజాస్టర్‌ను తలపిస్తున్నది. ఇలాంటి రెస్సాన్స్ చూస్తే ఈ సినిమా ఫ్లాప్ అనే ఫీలింగ్ కలిగింది. రంజాన్ సమయంలో కూడా సల్మాన్ ఖాన్ సినిమాకు స్పందన లేదంటే.. సల్లూభాయ్ ఫినిష్ అనిపిస్తున్నది. ఈ సినిమాపై పబ్లిక్ ఆసక్తిని కనబర్చడం లేదు అని ఉమేర్ సంధూ ట్వీట్ చేశారు.
పూజా హెగ్డే ఫెర్పార్మెన్స్ గురించి: కిసీ కా భాయ్, కిసీ కి జాన్ ఓవర్సీస్ సెన్సార్ బోర్డు నుంచి ఫస్ట్ రివ్యూ ఇది. అర్ధంపర్థంలేని ఫ్యామిలీ ఎంటర్‌టైనర్. బోరింగ్ ఫ్యామిలీ డ్రామా. సల్మాన్ ఖాన్ స్టార్ పవర్‌ను పాజిటివ్‌గా మలుచుకోలేకపోయింది. కథ, స్క్రీన్ ప్లే బాగాలేదు. పాటలు ఇంకా చెత్తగా ఉంది. పూజా హెగ్డే చాలా ఇరిటేటింగ్‌గా ఉంది అంటూ ఉమేర్ సంధూ ట్వీట్ చేశాడు.
డబ్బులు దాచుకోండి అంటూ: కిసీ కా భాయ్, కిసీ కి జాన్ సినిమాను సాధ్యమైనంత వరకు చూడకండి. ఈ సినిమాకు ఖర్చు పెట్టాలనుకొన్న మనీని టైగర్ 3 సినిమాకు దాచుకోండి అంటూ ఉమేర్ కామెంట్ చేశాడు. అయితే సాధారణంగా ఉమేర్ సంధూ చెప్పే, పోస్టు చేసే రివ్యూలు వాస్తవానికి దూరంగా ఉంటాయి. బ్లాక్ బస్టర్ అని చెప్పిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద దారుణమైన ఫలితాన్ని చవిచూశాయి. కాబట్టి కిసీ కా భాయ్, కిసీ కి జాన్ సినిమాపై ఆయన చెప్పిన టాక్ ఎంత వరకు నిజమని ట్రేడ్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.