ప్రపంచంలో చాలా దేశాలలో పెళ్లి ( Marriage ) అంటే భయపడే పరిస్థితి నెలకొంది.దీంతో చాలామంది ఒంటరిగా మిగిలిపోతున్నారు.పైగా పెళ్లి చేసుకున్న గాని కలసి కాపురం చేసే వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు.ఎవరు కూడా మాట పడటం లేదు.
పంతాలకు పోయి ఎవరికి వారు… విడిపోయే జంటలు ఎక్కువైపోయాయి.సామాన్యులు మొదలుకొని సెలబ్రిటీల వరకు పెళ్లయిన కొద్ది నెలలకే విడిపోతున్న వాళ్ళు చాలా జంటలు రోజురోజుకి పెరిగిపోతున్నాయి.
దీంతో సమాజంలో పెళ్లి అంటేనే విరక్తి కలిగి యువత ( Youth ) ఒంటరితనానికి అలవాటు పడిపోతోంది.పరిస్థితి ఇలా ఉండగా ఈ రకంగా ఒంటరితనానికి అలవాటు పడిపోయిన యువతకు దక్షిణ కొరియా( South Korea ) ప్రభుత్వం అండగా నిలబడటానికి రెడీ అయింది.
ఒంటరి పౌరులను తిరిగి సమాజంలో తీసుకురావడానికి అక్కడి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.విషయంలోకి వెళ్తే ఒంటరిగా జీవిస్తున్న యువతకు నెలకు 40,000 ప్రభుత్వం తరఫున పెన్షన్ అందించడానికి దక్షిణ కొరియా దేశం సిద్దమయింది.ఈ రకంగా దేశవ్యాప్తంగా దాదాపు మూడు లక్షల మంది యువత ఉన్నట్లు గుర్తించింది.ఒంటరితనం మనిషికి హానికరమని.అది వ్యక్తిని చాలా విధాలుగా ప్రభావితం చేస్తుందని.ప్రభుత్వం భావిస్తోంది.
కరోనా వంటి భయాలతో చాలామంది యువత ప్రపంచంతో సంబంధాలు తెంచుకుంటున్నారు.ఈ రకంగా కొంతమంది ఒంటరితనానికి లోనయ్యి మానసిక రోగులవుతున్నారు.ఇది దేశానికి అరిష్టమని దక్షిణ కొరియా దేశం యువతను కాపాడుకోవడానికి ఈ రకమైన.ప్రోత్సాహకంగా.ఒంటరితనాన్ని అనుభవించే యువతకు 40 వేల రూపాయలు అందించి సమాజంలో కలపటానికి ముందడుగులు వేయడం జరిగింది.ఇదే కార్యక్రమం భారతదేశంలో కూడా పెడితే బాగుంటుందని తాజా వార్తపై జనాలు కామెంట్లు చేస్తున్నారు.