Movies

ఆర్ఆర్ఆర్ టీమ్‌ని సన్మానించనున్న అమిత్‌షా.. ఎప్పుడంటే

ఆర్ఆర్ఆర్ టీమ్‌ని సన్మానించనున్న అమిత్‌షా.. ఎప్పుడంటే

ఆర్ఆర్ఆర్ సినిమాలోని నాటు నాటు సాంగ్ కు ఆస్కార్ అవార్డు వచ్చిన విషయం తెలిసిందే. దాంతో చిత్రయూనిట్ పై ప్రపంచం మొత్తం ప్రశంసలు కురిపించింది.

ఆర్ఆర్ఆర్ సినిమా ఎంతటి సంచలాన్ని సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఏకంగా ఆస్కార్ అవార్డును కూడా అందుకుంది ఈ సినిమా. ఆర్ఆర్ఆర్ సినిమాలోని నాటు నాటు సాంగ్ కు ఆస్కార్ అవార్డు వచ్చిన విషయం తెలిసిందే. దాంతో చిత్రయూనిట్ పై ప్రపంచం మొత్తం ప్రశంసలు కురిపించింది. ఇప్పటికే పలువురు ఆర్ఆర్ఆర్ టీమ్ ను పర్సనల్ గా కలిసి అభినందించారు. తాజాగా మరో రాజకీయ ప్రముఖుడు కూడా జక్కన్న టీమ్ ను అభినందించనున్నారు.

అమిత్ షా..! సెకండ్ బాస్ ఆఫ్ బీజేపీ! ఈయన ఇప్పుడు తెలంగాణలో పర్యటించనున్నారు. ఓ పక్క తన రాజకీయా కార్యక్రమాలు చేసుకుంటూనే మరో పక్క.. మన ట్రిపుల్ ఆర్ టీంను కలవనున్నారు. ఆస్కార్ సాధించిన మన వారిని అప్రిసియేట్ చేయనున్నారు. మనవాళ్లకు విందు కూడా ఇవ్వనున్నారు.

ఇప్పటికే చెర్రీ అండ్ జూనియర్‌ను విడివిడిగా కలిసిన అమిత్‌ షా.. తాజా తను షెడ్యూల్‌ చేసుకున్న తెలంగాణ టూర్లో.. ట్రిపుల్ ఆర్ టీంకు కూడా కాస్త చోటిచ్చారు. డైరెక్టర్ రాజమౌళి, మెగా పవర్ స్టార్ రామ్‌ చరణ్, యంగ్ టైగర్‌ ఎన్టీఆర్, మ్యూజిక్ డైరక్టర్ కీరవాణి, లిరిసిస్ట్ చంద్రబోసులను.. ఈ నెల 23న కలవనున్నారు. ఆస్కార్ గెలిచి ఇండియా పేరును మరో సారి విశ్వవ్యాప్తం చేసినందుకు వీరందరికీ చిన్న పార్టీ ఇవ్వనున్నారు. అయితే వీరితో పాటు.. ఎంపీ విజయేంద్ర ప్రసాద్ కూడా ఆహ్వానం అందుకున్న వారిలో ఉన్నారు.