మూడు రోజుల నష్టాల తర్వాత స్టాక్ మార్కెట్ గురువారం స్వల్ప లాభాలతో ముగిసింది. తీవ్ర ఆటుపోట్ల నడుమ జరిగిన ట్రేడింగ్‌లో సెన్సెక్స్ 64.55 పాయింట్ల లాభంతో…
ముంబై: మూడు రోజుల నష్టాల తర్వాత స్టాక్ మార్కెట్ గురువారం స్వల్ప లాభాలతో ముగిసింది. తీవ్ర ఆటుపోట్ల నడుమ జరిగిన ట్రేడింగ్‌లో సెన్సెక్స్ 64.55 పాయింట్ల లాభంతో 59,632.35 వద్ద, నిఫ్టీ 5.7 పాయింట్ల లాభంతో 17,624.45 వద్ద క్లోజయ్యాయి. ఇదిలా ఉండగా ఐటీసీ మార్కెట్ విలువ సరికొత్త గరిష్ఠ స్థాయి రూ.5 లక్షల కోట్లు దాటింది. మార్కెట్ క్యాప్‌లో ఎనిమిదో అతి పెద్ద కంపెనీగా రికార్డు సృష్టించింది.