Movies

గేమ్ చేంజర్:1000 మందితో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ బిగ్ రిస్క్.. తెలుగులో తొలిసారి ఇలా!

గేమ్ చేంజర్:1000 మందితో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్  బిగ్ రిస్క్.. తెలుగులో తొలిసారి ఇలా!

పేరుకు మెగాస్టార్ చిరంజీవి కుమారుడే అయినా.. తనదైన శైలి యాక్టింగ్, డ్యాన్స్, ఫైట్స్‌తో తెలుగు ప్రేక్షకులను అలరిస్తూ.. తక్కువ సమయంలోనే బడా హీరోగా ఎదిగిపోయాడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్. కెరీర్ ఆరంభంలోనే కమర్షియల్ హీరో అనిపించుకున్న అతడు.. ఈ మధ్య కాలంలో వరుసగా హిట్లు మీద హిట్లు కొడుతూ దూసుకుపోతోన్నాడు. దీనికితోడు గత ఏడాది వచ్చిన RRR (రౌద్రం రుధిరం రణం) అనే మూవీతో చరణ్ మరో ఇండస్ట్రీ హిట్‌ను సొంతం చేసుకున్నాడు. దీనితో పాటు గ్లోబర్ స్టార్‌ అనే పేరును కూడా దక్కించుకున్నాడు. దీంతో మరింత జోష్‌తో ఉన్నాడు.

ప్రస్తుతం మెగా పవర్ స్టార్ రామ్ చరణ్.. దిగ్గజ దర్శకుడు ఎస్ శంకర్‌తో కలిసి ‘గేమ్ చేంజర్’ అనే సినిమాను చేస్తున్నాడు. దీనికి సంబంధించిన షూటింగ్ ఎప్పుడో మొదలైనా మధ్యలో కొన్ని బ్రేకులు వచ్చాయి. దీంతో ఇప్పటికి దీనికి సంబంధించిన 70 శాతానికి పైగా టాకీ పార్ట్ కూడా విజయవంతంగా పూర్తి చేశారు. ఇక, మిగిలిన భాగాన్ని కూడా వీలైనంత త్వరగా పూర్తి చేసేలా చిత్ర యూనిట్ ప్లాన్ చేసుకుంటోంది. అందుకు అనుగుణంగానే అన్నీ పక్కాగా ప్లాన్ చేసుకుంటూ వెళ్తోంది. ఈ నేపథ్యంలో తాజాగా ఈ మూవీ నుంచి అదిరిపోయే న్యూస్ ఒకటి వైరల్ అవుతోంది

రామ్ చరణ్ కెరీర్‌లోనే ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందుతోన్న ‘గేమ్ చేంజర్’ చిత్రానికి సంబంధించిన క్లైమాక్స్ పార్ట్ షూటింగ్‌ను మరికొద్ది రోజుల్లోనే ప్రారంభించబోతున్నట్లు తెలిసింది. అంతేకాదు, ఇందులో చరణ్‌ ఏకంగా వేయి మంది ఫైటర్లతో యాక్షన్ సీక్వెన్స్ చేయబోతున్నాట. ఇప్పుడు దీనికి సంబంధించిన ట్రయల్ వర్క్ జరుగుతున్నట్లు తెలిసింది. ఇక, ఈ క్లైమాక్స్ ఫైట్ ఇప్పటి వరకూ తెలుగులో ఏ సినిమాలో రాని విధంగా డిజైన్ చేశారని అంటున్నారు. ఇందులో చరణ్ కొన్ని రిస్కీ షాట్లు కూడా చేస్తున్నాడని తెలిసింది. దీంతో ఈ ఎపిసోడ్‌పై అంచనాలు ఏర్పడ్డాయి.

‘గేమ్ చేంజర్’ మూవీలో రామ్ చరణ్‌కు జోడీగా కియారా అద్వాణీ నటిస్తోంది. ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. అలాగే, ఈ సినిమాకు ఎస్ థమన్ సంగీతం ఇస్తున్నాడు. శ్రీకాంత్, జయరాం, అంజలి, రాజీవ్ కనకాల తదితరులు కీలక పాత్రలను పోషిస్తున్నారు. దీన్ని వచ్చే ఏడాది సంక్రాంతికి రిలీజ్ చేయబోతున్నారు.