US Gun Fire: అమెరికాలో దుండగులు జరిపిన కాల్పుల్లో ఉన్నత విద్యాభ్యాసం కోసంవెళ్లిన ఏలూరు జిల్లా యువకుడు దుర్మరణం పాలయ్యాడు. గురువారం తెల్లవారుజామున ఒహాయోలో జరిగిన ఏలూరు అశోక్‌నగర్‌కు చెందిన పాతికేళ్ల యువకుడు ప్రాణాలు కోల్పోయాడు.
US Gun Fire: అమెరికాలో జరిగిన గన్ ఫైరింగ్ ఘటనలో ఏలూరు వాసి మృతి చెందాడు. ఆమెరికాలోని ఒహాయోలో దుండగులు జరిపిన కాల్పుల్లో ఏలూరు అశోక్‌నగర్‌కు చెందిన వీరా సాయేశ్ మృతి చెందాడు.
ఎంఎస్ చేయడానికి వెళ్లిన సాయేశ్ స్థానికంగా ఉన్న గ్యాస్ స్టేషన్లో పార్ట్‌టైం ఉద్యోగం చేస్తున్నారు. గురువారం సాయేశ్ పనిచేస్తున్న స్టేషన్‌కు ఓ దొంగల ముఠా వచ్చి విధుల్లో ఉన్న అతణ్ని తుపాకీతో కాల్చారు. ఈ ఘటనలో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. సాయేశ్ తండ్రి కొన్నేళ్ల కిందటే చనిపోయారు. తల్లి, అన్నయ్య ఉన్నారు. సాయేశ్ 2021 నవంబరులో ఎంఎస్ చేసేందుకు అమెరికా వెళ్లారు.
దుండగుల కాల్పుల్లో తెలుగు యువకుడి దుర్మరణం చెందడం స్థానికంగా కలకలం రేపింది. వెస్ట్ కొలంబస్‌లో అర్ధరాత్రి 12.50 లకు జరిగిన ఈ ఘటనలో ఏలూరు వాసి సాయిష్ వీర ప్రాణాలు కోల్పోయాడు. ఫ్రాంక్లింటన్,1000 వెస్ట్‌బ్రాడ్ స్ట్రీట్‌లోని షెల్ గ్యాస్ స్టేషన్‌లో పనిచేస్తున్న వీర సాయేశ్, దోపిడీకి ప్రయత్నించిన దొంగను అడ్డుకున్నాడు.
దీంతో రెచ్చిపోయిన దుండగులు.. సాయిష్‌పై కాల్పులు జరిపారు. ఆ కాల్పుల్లో సాయిష్ ప్రాణాలు కోల్పోయాడు. కాల్పులకు పాల్పడిన అనుమానితుడి ఫోటోలను కొలంబస్ పోలీసులు విడుదలచేశారు. ఈ సంవత్సరం కొలంబస్‌లో ఇది 50వ హత్య అని స్థానికులు చెబుతున్నారు.
24 ఏళ్ళ సాయిష్ మరో రెండు వారాల్లో పార్ట్ టైమ్ ఉద్యోగం మానేయాలనుకున్నాడు. కానీ, ఇంతలోనే ఈ అనుకోని ఘటన జరగడం అతని కుటుంబాన్ని తీవ్ర విషాదంలో ముంచేసింది. మధ్యతరగతి కుటుంబానికి చెందిన సాయిష్ కొలంబస్‌లో మాస్టర్స్ చేస్తున్నాడు. H1B వీసా కూడా తీసుకున్నాడు.
అమెరికాలోని ఓహియో రాష్ట్రంలోని పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, ఆంధ్రప్రదేశ్‌కు చెందిన 24 ఏళ్ల సాయిష్ పనిచేస్తున్న గ్యాస్ స్టేషన్‌లో కాల్పులు జరపడంతో తుపాకీ గాయాలతో మరణించాడు.
మృతుడిని సాయిష్ వీరగా గుర్తించామని, ఈ సంఘటన గురువారం రాష్ట్రంలోని కొలంబస్ డివిజన్‌లో జరిగిందని వారు తెలిపారు. “ఏప్రిల్ 20, 2023న, ఉదయం 12:50కి, కొలంబస్ పోలీసు అధికారులకు కాల్పులు జరిగినట్లు పోలీసులకు సమాచారం అందింది. బాధితుడిని స్థానిక ఆసుపత్రికి తరలించి ప్రాణాలను కాపాడేందుకు ప్రయత్నించినా తెల్లవారుజామున 1.27 గంటలకు మృతి చెందినట్లు తెలిపారు.
సాయిష్ అందరికి అడగ్గానే హెల్ప్ చేసే వాడని, అలాంటి వ్యక్తికి ఇలా జరగడం బాధాకరమని.. స్నేహితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు సాయిష్ మృతదేహాన్ని స్వస్థలానికి తరలించేందుకు స్నేహితులు గోఫండ్ ద్వారా విరాళాలను సేకరిస్తున్నారు. ప్రభుత్వం కూడా ఆదుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ఏపీ ప్రభుత్వం చొరవ తీసుకుని మృతదేహాన్ని స్వదేశానికి రప్పించేేందుకు విదేశాంగ శాఖ ద్వారా ఏర్పాట్లు చేయాలని కోరుతున్నారు.