సాధారణంగా కనిపించే వారికంటే బుగ్గకు సొట్ట ఉన్న అమ్మాయిలైనా, అబ్బాయిలైనా.. అందంగా కనిపిస్తారు. వారు నవ్వినప్పుడు ఆ బుగ్గన సొట్ట ఎంతో అద్భుతంగా కనిపిస్తుంది. సినీ రంగంలో కూడా సొట్ట బుగ్గలున్న హీరో, హీరోయిన్లు ఎక్కువగానే ఉన్నారు. వారి అందానికి బుగ్గన సొట్ట కూడా ఓ కారణమని చెప్పొచ్చు. అయితే.. ఆ సొట్ట బుగ్గలు ఎలా వస్తాయో తెలుసా? సొట్ట బుగ్గల్లో ఎంత అందం ఉందో దానికి వెనుక పెద్ద సైన్టిఫిక్ రీజన్ కూడా ఉంది. అదేంటో తెలుసుకుందాం..సాధారణంగా కనిపించే వారికంటే బుగ్గకు సొట్ట ఉన్న అమ్మాయిలైనా, అబ్బాయిలైనా.. అందంగా కనిపిస్తారు. వారు నవ్వినప్పుడు ఆ బుగ్గన సొట్ట ఎంతో అద్భుతంగా కనిపిస్తుంది. సినీ రంగంలో కూడా సొట్ట బుగ్గలున్న హీరో, హీరోయిన్లు ఎక్కువగానే ఉన్నారు. వారి అందానికి బుగ్గన సొట్ట కూడా ఓ కారణమని చెప్పొచ్చు. అయితే.. ఆ సొట్ట బుగ్గలు ఎలా వస్తాయో తెలుసా? సొట్ట బుగ్గల్లో ఎంత అందం ఉందో దానికి వెనుక పెద్ద సైన్టిఫిక్ రీజన్ కూడా ఉంది. అదేంటో తెలుసుకుందాం..
మన శరీరం అనేక రకాల కండరాలతో నిండి ఉంటుంది. ముఖంలోని ప్రధాన కండరమైన జైగోమాటిక్ మామూలుగా దవడ ఎముక నుంచి నోటి మూల వరకు ఒకేలా ఉంటుంది. కొందరిలో పుట్టుకతోనే ఈ కండరం రెండుగా చీలిపోయి ఒకటి నోటి చివర వరకు ఉంటే.. మరోకటి చెంప మధ్య వరకు మాత్రమే ఉంటుంది. జైగోమాటిక్ కండరంలో ఏర్పడిన ఖాళీ ప్రదేశంలోనే సొట్ట వస్తుంది. నవ్వినా, మాట్లాడినా కండరాలు కదలడం వల్ల చెంపన సొట్ట పడుతుంది. అంతే కాకుండా జీన్స్ పరంగా.. తల్లిదండ్రుల నుంచి పిల్లలకు సొట్టబుగ్గలు వచ్చే అవకాశం 40% మాత్రమే ఉందట.