💥తన చావుకు ఇంటెలిజెన్స్ సీఐ కారణమంటూ.. వ్యక్తి సూసైడ్
కరీంనగర్: నాచావుకు సెంట్రల్ ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్‌లో పని చేస్తున్న సీఐ గోపాలకృష్ణ కారణం అంటూ కరీంనగర్ జిల్లా చొప్పదండికి చెందిన బోడిగేశ్యామ్ అలియాస్ శంభయ్య అనే వ్యక్తి ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. వివరాల్లోకి వెళ్లితే భూమి విషయంలో సీఐ గోపీ కృష్ణ తనను బెదిరించాడంటూ సుసైడ్ నోట్ రాసి ఆత్మహత్య చేసుకన్నాడు. రూ. 30 లక్షల భూమిని కొనుగోలు చేసిన గోపాలకృష్ణ 8 నెలల్లో రెట్టింపు కోరి టార్చర్ పెట్టినట్లు సూసైడ్ నోట్‌లో శంభయ్య పేర్కొన్నాడు. అసభ్య పదజాలంతో తిట్టడంతో తాను మనస్థాపంతో ఆత్మహత్య చేసుకుంటున్నట్లు సూసైట్ నోట్‌లో పేర్కొన్నాడు.
* ఏలూరుజిల్లా.జిల్లాలో పంచాయతీ కార్యదర్సులు తాము విధులు నిర్వహించే పంచాయతీలలో నే ఆర్థిక దోపిడీలకు తెగబడుతున్నారు.పెదవేగి మండలం.ఉంగుటూరు మండలం.ఏలూరు మండలం .జంగారెడ్డి గూడెం మండలాలలో బాటు మరికొన్ని మండలాలలో ఉన్న కొన్ని పంచాయతీలలో కార్యదర్సులు బారి ఎత్తున నిధులు స్వాహా కు పాల్పడ్డారని విన్నాము .తాజాగా నిడమర్రు మండలం నిడమర్రు గ్రామ పంచాయతీ లో లక్షలాది రూపాయల నిధులు పంచాయితి కార్యదర్శులు నీరజ , స్వామి మరియు సర్పంచి పొట్నూరి ఉమా మహేశ్వర రావు నిధులు దుర్వినియోగానికి పాల్పడ్డారని సాక్ష్యాత్తూ డీపీవో నివేదిక లోనే వెలుగు చూడటం విశేషం. పంచాయతీ నిధులు దుర్వినియోగం చేశారని గ్రామస్తులు సంకెళ్ళ రాంబాబు అనే వ్యక్తి ఆధారాలతో సహా జిల్లా కలెక్టర్ కి స్పందనలో ఫిర్యాదు చేసాడు.ఈ పిర్యాదు పై జిల్లా పంచాయతీ అధికారి అదేశాలు మేరకు విచారణ కొరకు ప్రత్యేక అధికారిగా డివిజనల్ పంచాయితి అధికారి అన్నా మణి ని DPO మల్లిఖార్జునరావు విచారణ అధికారిగా నియమించారు.ఈ విచారణలో నిడమర్రు గ్రామ పంచాయతీ నిధులు 10,24,848 దుర్వినియోగం అయినట్లు డిపివో కి డి ఎల్ పి ఓ నివేదిక అందజేసామని డి ఎల్ పి ఓ అన్నా మణి ఏలూరు మెట్రో టి వి ప్రతినిదికి శని వారం తెలిపారు.దీనిపై జిల్లా అధికారులు అక్రమాలకు పాల్పడిన నిడమర్రు పంచాయతీ ఉద్యోగులపై చర్యలు చేపట్టనున్నారు.
* విజయవాడ :
సంకల్పసిద్ధి కుంభకోణం డబ్బుతో… ఈ భూములనే కొనుగోలు చేశారు
గత సంవత్సరం నవంబర్ నెలలో రాష్ట్రంలో సంచలనం సృష్టించిన సంకల్ప సిద్ధి మార్ట్ గొలుసుకట్టు మోసం వ్యవహారంలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి.
నిందితుడు గుత్తా కిరణ్ విచారణలో కీలక విషయాలను వెల్లడించారు. డిపాజిటర్ల నుంచి వసూలు చేసిన సొమ్మును ఎక్కడెక్కడ పెట్టుబడి పెట్టారు..? ఏయే ప్రాంతాల్లో, ఏ రూపంలో ఆస్తులు కూడబెట్టారు? అనే తదితర వివరాలను అధికారులు రాబట్టారు.
Sankalp Siddi Key Accused Kiran Trial Updates:
విజయవాడలో సంచలనం సృష్టించిన సంకల్ప సిద్ధి గొలుసుకట్టు మోసం కేసులో.. నిందితుడు గుత్తా కిరణ్ విచారణలో కీలక విషయాలు వెలుగుచూశాయి. డిపాజిటర్ల నుంచి వసూలు చేసిన సొమ్మును ఎక్కడెక్కడ పెట్టుబడి పెట్టారో..? ఏయే ప్రాంతాల్లో ఏ రూపంలో ఆస్తులు కూడబెట్టారో..? తదితర వివరాలను విచారణలో కిరణ్ వెల్లడించినట్లు తెలిసింది. ఎర్ర చందనం చెట్ల పెంపకం కోసం అంటూ.. కనిగిరి పరిసరాల్లో పెద్ద ఎత్తున భూములు కొనుగోలు చేసినట్లు విచారణలో తేలింది.
సంకల్పసిద్ధి కుంభకోణం కేసులో కీలక నిందితుడు గుత్తా కిరణ్‌ను కర్ణాటకలో అరెస్టు చేసిన పోలీసులు విజయవాడ తీసుకొచ్చారు. ఈ క్రమంలో ప్రస్తుతానికి రిమాండ్‌లో ఉన్న నిందితుడి నుంచి అధికారులు పలు కీలక అంశాలను రాబట్టారు. ఆయన వ్యక్తిగత విషయాలతోపాటు.. సంస్థ పెట్టుబడుల గురించి వివరాలు సేకరించారు. కర్ణాటకలోని బళ్లారి జిల్లా హుసదుర్గ తాలూకా గోరవినకల్ కిరణ్ స్వస్థలమని.. తొలుత సంజీవిని పచ్చళ్ల పేరుతో వ్యాపారం చేసినట్లు గుర్తించారు. ఆ సమయంలో సోదరుడి వరుస అయ్యే గుత్తా వేణుగోపాలకృష్ణతో కలిసి హైదరాబాద్‌లో.. 2017లో ప్లాంట్ ఎన్‌రిచ్ ఎంటర్‌ప్రైజెస్ అనే మల్టీలెవల్ మార్కెటింగ్ ప్రారంభించారు. అయితే, అది ఆశాజనకంగా ఉండడంతో మళ్లీ ఇద్దరూ కలిసి “రిచ్‌కేర్ లైఫ్ “అనే పేరుతో మరొక సంస్థను మొదలుపెట్టారు.
ఆ తర్వాత సంకల్ప మార్ట్ పేరుతో మరొకటి మొదలుపెట్టినా.. కొవిడ్ కారణంగా వ్యాపారం దెబ్బతింది. దీంతో ఇద్దరూ విడిపోయారు. కొద్ది రోజుల తర్వాత విజయవాడలో సంకల్పసిద్ధి ఈ-కార్ట్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో ఎమ్.ఎల్.ఎమ్. సంస్థను స్థాపించినని.. నిర్వహణ చూసుకునేందుకు తిరిగి రావాలని కిరణ్‌ను వేణుగోపాలకృష్ణ పిలిచినట్లు విచారణలో తేలింది. ప్రజల నుంచి పెద్ద ఎత్తున డిపాజిట్లను రాబట్టేందుకు ఏజెంట్లు, కోర్ కమిటీ ఏజెంట్లకు ఆకర్షణీయ పథకాలు, కమీషన్లను ప్రకటించినట్లు కిరణ్ విచారణలో వెల్లడించారు. దీంతో వ్యాపారం భారీగా పుంజుకుంది. ఈ నేపథ్యంలో వచ్చిన ఆ డబ్బుతో ఎర్రచందనం చెట్లను పెంపకానికి అంటూ డిపాజిటర్ల డబ్బుతో భారీగా భూములను కొనుగోలు చేయటం ప్రారంభించారు.
ప్రకాశం జిల్లా కనిగిరి, చుట్టుపక్కల కొన్నారు. బుడగలేరు పంచాయతీ పరిధిలో 6 కోట్ల రూపాయలతో 40 ఎకరాలు, 1.30 కోట్ల రూపాయలతో అక్కడే 35 ఎకరాలు తీసుకున్నారు. బుడగలేరులో 20 ఎకరాలు, కనిగిరిలో 6.32 ఎకరాలు, 5.51 ఎకరాలు, 6.57 ఎకరాలు కొని విజయవాడలోని జాయింట్ సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయంలో రిజిస్ట్రేషన్ చేయించినట్లు గుర్తించారు. కనిగిరి ప్రాంతంలోనే 16 ఎకరాలు, 3.30 ఎకరాల భూములను కొని బాపులపాడు మండలంలోని కానుమోలు, గన్నవరం సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయంలో రిజిస్టర్ చేయించినట్లు గుర్తించారు.
ఈ నేపథ్యంలో ప్రకాశం జిల్లాలోని వెలిగండ్ల మండలంలో దాదాపు 14.28 ఎకరాలను కొనుగోలు చేసేందుకు బయానా కూడా ఇచ్చారు. కానీ.. అది ఇంకా రిజిస్ట్రేషన్‌ను చేయించలేదు. వీటితోపాటు.. బళ్లారిలో రెండు నివాస ప్లాట్లకు 69 లక్షలు, అనంతపురం జిల్లా కందుకూరులో 8.13 ఎకరాల కోసం 6.90 కోట్ల రూపాయలతో భూమిని కొనుగోలు చేశారు. కర్ణాటకలోని హోస్పేటలో రెండు నివాస ప్లాట్ల కోసం 67 లక్షల రూపాయల డబ్బులు చెల్లించారు. ఇంకా రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి కాలేదని పోలీసులు గుర్తించారు.
* పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాష్ పార్వతీపురం మన్యం జిల్లాలో చేసిన విద్యాశాఖ అధికారుల సస్పెన్షన్లు ఉపసంహరించుకోవాలి. శ్రీ ప్రవీణ్ ప్రకాష్ తన ధోరణి మార్చుకోవాలి- కేఎస్ లక్ష్మణ్ రావు ఎమ్మెల్సీ