Movies

టాలీవుడ్ లో సక్సెస్ఫుల్ గా 24 ఏళ్ళు కంప్లీట్ చేసుకున్న త్రివిక్రమ్ శ్రీనివాస్

టాలీవుడ్ లో సక్సెస్ఫుల్ గా 24 ఏళ్ళు కంప్లీట్ చేసుకున్న త్రివిక్రమ్ శ్రీనివాస్

టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో టాప్ డైరెక్టర్ గా కొనసాగుతున్న వారిలో త్రివిక్రమ్ శ్రీనివాస్ ( Trivikram Srinivas ) ఒకరు.

ఈయనకు ప్రస్తుతం మంచి క్రేజ్ ఉంది అనే చెప్పాలి.

ముందు నుండి ఈయన రైటర్ గా దర్శకుడిగా ఆడియెన్స్ లో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు అనేది తెచ్చుకుని స్టార్ డైరెక్టర్ గా ఎదిగాడు.ఇక త్రివిక్రమ్ దర్శకుడిగా మొదటి సినిమా నువ్వే నువ్వే.

ఈ సినిమాతో మెగా ఫోన్ పట్టారు.

ఇక ఈయన టాలీవుడ్ లో రైటర్ గా అడుగు పెట్టారు.వేణు తొట్టెంపూడి, లయ హీరో హీరోయిన్లుగా తెరకెక్కిన స్వయంవరం సినిమా( Swayamvaram )తో ఈయన రైటర్ గా మొదటి సినిమా తోనే మంచి విజయం సాధించాడు.ఇక దర్శకుడిగా పరిచయం అయిన నువ్వే నువ్వే సినిమా కూడా విజయం సాధించడంతో ఈయన తిరిగి చూసుకోలేదు.

అప్పటి నుండి ఈయన ప్రయాణం మొదలయ్యింది.వరుస సినిమాలు చేస్తూ స్టార్ హీరోలను( Star Heroes ) డైరెక్ట్ చేస్తూ స్టార్ డైరెక్టర్ గా ఎదిగాడు.టాలీవుడ్ లో దాదాపు అగ్ర హీరోలందరితో చేసాడు.1999 ఏప్రిల్ 22న ఈయన రైటర్ గా పని చేసిన స్వయంవరం సినిమా రిలీజ్ అయ్యింది.దీంతో ఈయన కెరీర్ స్టార్ట్ చేసి 24 ఏళ్ళు పూర్తి అయ్యాయి.

దీంతో ఈయనకు పలువురు ప్రముఖులు అభినందనలు చెబుతున్నారు.

కాగా త్రివిక్రమ్ ప్రస్తుతం సూపర్ స్టార్ మహేష్ బాబు ( Mahesh Babu ) తో SSMB28 తెరకెక్కిస్తున్నాడు.హారిక హాసిని బ్యానర్ పై ఎస్ రాధాకృష్ణ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ సినిమా శరవేగంగా షూటింగ్ జరుపు కుంటుంది.ఇక ఈ సినిమాలో మహేష్ కు జోడీగా పూజా హెగ్డే( Pooja Hegde ), శ్రీలీల హీరోయిన్ లుగా నటిస్తుండగా.

జగపతిబాబు నెగిటివ్ రోల్ లో నటిస్తున్నాడు.ఈ సినిమాను వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 13న రిలీజ్ చేస్తున్నారు