వేసవిలో ఎక్కువగా దాహం వేస్తుంటుంది. అందువల్ల చాలామంది కూల్‌డ్రింక్స్ ఎక్కువగా తాగుతుంటారు. అవి తాగడం వల్ల దాహం తీరకపోగా మరింత దాహం తీరుతుంది.
వేసవి వచ్చేసింది. ఎండలు మండిపోతున్నాయి. వేడిగాలులు, ఉక్కపోతతో ప్రజలు అల్లాడుతున్నారు. వేసవి తాపాన్ని తట్టుకోవాలంటే ఏం ఆహారాన్ని తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందా…
మజ్జిగ:వేసవిలో మజ్జిగ తప్పక తాగాల్సిందే. ఇది శరీరంలో ఉష్ణోగ్రత తగ్గించడంతో పాటు వేసవి తాపం నుంచి కాపాడుతుంది.
కొబ్బరినీరు:కొబ్బరినీటిలో ఆరోగ్యకర ప్రయోజనాలతో పాటు శరీరాన్ని చల్లబరిచే గుణాలు ఎన్నో ఉన్నాయి. శరీరానికి కావల్సిన సహజమైన చక్కెర, ఎలక్ట్రోలైట్స్, ఖనిజ లవణాలను కొబ్బరినీరు అందిస్తుంది.
పుచ్చకాయ:వేసవి కాలంలో ఎక్కువగా లభించే పుచ్చకాయలు శరీరానికి ఎంతో మేలు చేస్తుంది. దీనిలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. వేసవిలో శరీరానికి కావల్సిన ఖనిజ లవణాలు, పోషకాలను పుచ్చకాయ అందిస్తాయి.
కీరదోస:వేసవిలో కీరదోసలను ఎక్కువగా తీసుకోవాలి. వీటిలో ఎక్కువగా లభించే ఫైబర్, నీరు డీహైడ్రేషన్ నుంచి రక్షించి శరీరాన్ని చల్లబరుస్తాయి.
ఇవి తింటే వేసవిని ఓడించొచ్చు:
పుదీనా:శరీరాన్ని చల్లబరిచే గుణాలు పుదీనాలో చాలా ఉన్నాయి. ఎండలో తిరిగి అలసిపోయినప్పుడు పుదీనాతో చేసిన జ్యూస్ శరీరానికి ఉత్తేజాన్ని, కొత్త శక్తిని ఇస్తుంది.
ఉల్లిపాయలు:ఉల్లిపాయల్లోనూ శరీరాన్ని చల్లబరిచే గుణాలు ఉన్నాయి. కూరలు, చట్నీ, సలాడ్స్ రూపంలో ఉల్లిపాయలను ఎక్కువగా తీసుకోవాలి. ఎరుపు రంగులో ఉండే ఉల్లిపాయలు తీసకుంటే ఇంకా మంచిది. ఉల్లిపాయలో ఎండదెబ్బ నుంచి కాపాడే గుణాలు ఎన్నో ఉన్నాయి.
ఖర్బూజా:రుచిలో దోసకాయలను పోలి ఉండే ఖర్బూజా పండ్లలో 90 శాతం నీరే ఉంటుంది. వీటిని వేసవిలో ఎక్కువగా తీసుకోవడం వల్ల శరీరం డీహైడ్రేషన్‌కు గురికాకుండా కాపాడుతుంది.
నిమ్మరసం:వేసవిలో నిమ్మరసం తీసుకోవడం వల్ల వేసవి తాపాన్ని తగ్గించుకోవచ్చు. కొద్దిగా చక్కెర, ఉప్పు, నిమ్మరసం కలిపి తయారు చేసిన చల్లని షర్బత్‌ను తాగితే శరీరానికి చాలా మంచిది.
ఐస్‌క్రీమ్:వేసవి వచ్చిందంటే చాలామంది ఐస్‌క్రీమ్‌ను ఓ పట్టుపడతుంటారు. వీటి వల్ల శరీరానికి చల్లదనం చేకూరుతుంది. అయితే కొవ్వు, షుగర్‌ల దృష్ట్యా ఐస్‌క్రీమ్‌ను కొద్దిగానే తీసుకోవాలి. ఫ్యాట్ తక్కువగా ఉన్న ఐస్ క్రీమ్‌లు తీసుకుంటే ఇంకా మంచిది.