ఎస్ఆర్‌కెఆర్ ఇంజనీరింగ్ కాలేజీ పూర్వ విద్యార్ధులు
సానా పేరిట కొత్త సంఘం ఏర్పాటు..
నాట్స్ అమెరికా తెలుగు సంబరాల్లో పూర్వ విద్యార్ధుల సమ్మేళనం.
ఎడిసన్: న్యూ జెర్సీ: ఏప్రిల్: 24: అమెరికాలో ఇప్పుడు తెలుగువారు ఎక్కడుకున్నా ఐకమత్యంతో ముందుకు సాగేందుకు ప్రయత్నిస్తున్నారు. తాజాగా ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా భీమవరానికి చెందిన ఎస్ఆర్‌కెఆర్ పూర్వ విద్యార్ధులంతా మనమంతా ఒక్కటే అంటూ కొత్తగా ఓ సంఘాన్ని ఏర్పాటు చేశారు. (ఎస్ఆర్‌కెఆర్ఈసీ ఆలంనై అసోషియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా) సానా పేరుతో ఓ సంఘాన్ని ఏర్పాటు చేశారు. భీమవరంలో ఎస్ఆర్‌కెఈసీకి దాదాపు 43 ఏళ్ల చరిత్ర ఉంది. ఈ కాలేజీలో చదువుకున్న విద్యార్ధులు అమెరికా, యూకే తోపాటు అనేక దేశాల్లో ఉన్నత ఉద్యోగాలు చేస్తూ స్థిరపడ్డారు. ప్రస్తుతం అమెరికాలో ఉంటున్న ఎస్ఆర్‌కెఈసీ పూర్వ విద్యార్థులంతా సానా పేరుతో ఓ సంఘంగా ఏర్పడ్డారు. ఈ క్రమంలోనే మే నెల 27 తేదీన నాట్స్ అమెరికా తెలుగు సంబరాల్లో ఎస్ఆర్‌కెఈసీ పూర్వ విద్యార్ధులంతా సమావేశం కావాలని నిశ్చయించుకున్నారు. అమెరికాలో ఉంటున్న ఎస్ఆర్‌కెఈసీ పూర్వ విద్యార్ధులంతాక సానా సంఘంలో సభ్యులుగా చేరి నాట్స్ అమెరికా తెలుగు సంబరాలకు విచ్చేయాలని సానా తెలిపింది. భీమవరం అనుభవాలను పంచుకోవడానికి.. కాలేజీ మధురానుభూతులను గుర్తు చేసుకోవడానికి ఇది చక్కటి అవకాశమని సానా ఓ ప్రకటనలో తెలిపింది. అమెరికా, కెనడా ప్రాంతాలనుండి సానాలో సభ్యులుగా చేరేందుకు www.thesaana.orgలో కనెక్ట్ కావాలని కోరింది.