NRI-NRT

ప్రపంచ వ్యాప్తంగా భారాస వ్యవస్థాపక దినోత్సవం.

ప్రపంచ వ్యాప్తంగా భారాస వ్యవస్థాపక దినోత్సవం.

అమెరికాలో ప్రత్యక్షంగా పాల్గొననున్న భారాస ఎన్నారై కో-ఆర్డినేటర్ మహేష్ బిగాల.

భారాస వ్యవస్థాపక దినోత్సవాన్ని 27న హైదరాబాద్‌ పార్టీ ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమాలను విస్తృతంగా నిర్వహించుకోవాలని భారత రాష్ట్ర సమితి నిర్ణయించింది. ఇందులో భాగంగా ఈ నెల 27న తెలంగాణ భవన్‌లో పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను నిర్వహించనున్నది. ఈ విషయాన్ని పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కల్వకుంట్ల తారకరామారావు ప్రకటించారు. ఈ సందర్బంగా భారాస ఎన్నారై కో-ఆర్డినేటర్ మహేష్ బిగాల మాట్లాడుతూ ప్రపంచ వ్యాప్తంగా వున్నా భారాస ఎన్నారై శ్రేణులు వారి వారి దేశాలలో ఘనంగా జెండా పండగ నిర్వహించాలని పిలుపు నిచ్చారు. ఈ సంవత్సరం జరిగే ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమాలకు అమెరికాలో ప్రత్యక్షంగా హాజరు అవుతున్నట్టు తెలిపారు, ఈ సందర్బంగా కెసిఆర్ గారి ఆలోచనల మేరకు అసెంబ్లీ ఎన్నికలు సమీపించిన వేళ త్వరలో నిర్వహించబోతున్న బీఆర్‌ఎస్‌ అన్ని రాష్ట్రాల ఎన్నారైల్లను ఏకం చేస్తామని మహేష్ బిగాల తెలిపారు.