తానా ఫౌండేషన్ తో పాటు ఆ సoస్త సభ్యుల సహకారంతో గంగా పుష్కరాల సందర్భంగా కాశీలో నిర్వహిస్తున్న అన్నదానానికి మంచి స్పందన లభిస్తుంది. సోమవారం నాడు మూడవరోజు నిర్వహించిన తానా అన్నదానానికి దాదాపు 1000 మందికి పైగా భక్తులు స్వీకరించారు. ఇతర దేశాల నుండి వచ్చిన వారు కూడా అన్నదానం జరుపుతున్న శివాల ఘాటుకు వచ్చి భోజనాలు చేస్తున్నారు. మంచి పదార్థాలతో చక్కటి భోజనాన్ని అందిస్తున్న తానా ఫౌండేషన్ సభ్యులను అభినందిస్తున్నారు.
అన్నదానానికి హాజరవుతున్న యాత్రికుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. కాశీలో ఉంటున్న సోమా కంపెనీ జనరల్ మేనేజర్ పి ఎస్ ఆర్ కోటేశ్వరరావు ఈ అన్నదాన కార్యక్రమానికి సహకారాన్ని అందిస్తున్నారు.
వారణాసి నుండి కిలారు ముద్దుకృష్ణ