రంపచోడవరం అటవీ శాఖ అసిస్టెంట్ రేంజ్ అధికారి డి.లలిత కుమారి రూ. 50 వేలు లంచం తీసుకుంటూ సోమవారం ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు. టేకు చెట్లు విక్రయించేందుకు అనుమతి పత్రాలపై సంతకం చేసేందుకు కొండబాబు అనే వ్యక్తి వద్ద నుండి ఈ సొమ్ము తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. అనుమతి పత్రాలు ఇచ్చేందుకు ఆమె భారీగా డబ్బులు డిమాండ్ చేయడంతో బాధితుడు ఏసీబీని అశ్రాయించాడని అధికారులు తెలిపారు.