Movies

తండ్రి యాక్షన్..తనయుడు డైరెక్షన్..!

తండ్రి యాక్షన్..తనయుడు డైరెక్షన్..!

స్టార్ తనయుడు తప్పకుండా స్టార్ అయి తీరుతాడు.. వారసుడిని హీరోగా పరిచయం చేసేందుకు హీరోలు కూడా ఎంతో ఉత్సాహం చూపిస్తారు. ఎంట్రీ ఇప్పించడం వరకు ఓకే ఆ తర్వాత తమ స్టామినా ప్రూవ్ చేసుకోవాల్సింది మాత్రం వారే.

అయితే బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ తనయుడిని కూడా హీరోగా పరిచయం చేస్తాడని అనుకున్నారు. కానీ షారుఖ్ తనయుడు ఆర్యన్ ఖాన్ అందరికి షాక్ ఇస్తూ డైరెక్షన్ చేస్తున్నాడు. హీరోగా ఎంట్రీ ఇచ్చే ఉద్దేశం లేదో లేక వద్దనుకున్నాడో కానీ ఆర్యన్ ఖాన్ సినిమా హీరో కాదు డైరెక్టర్ గా మారిపోయాడు.

అంతేకాదు ఒక కొత్త బిజినెస్ కూడా మొదలు పెట్టాడు ఆర్యన్ ఖాన్. డ్యావెల్ ఎక్స్ అనే లగ్జరీ క్లాత్ బ్రాండ్ ని మొదలు పెడుతున్నాడు. దీనికి సంబంధించిన సర్ ప్రైజింగ్ వీడియోతో ఆర్యన్ ఖాన్ వచ్చాడు. అంతేకాదు ఈ యాడ్ ని ఆర్యన్ ఖాన్ డైరెక్ట్ చేయగా షారుఖ్ ఖాన్ అందులో నటించాడు.

ఎంతైనా కొడుకు దర్శకత్వంలో నటించడం షారుఖ్ కి కొత్త ఉత్సాహాన్ని ఇస్తుందని చెప్పొచ్చు. షారుఖ్ ఖాన్ రీసెంట్ గా పఠాన్ తో సూపర్ హిట్ అందుకున్నారు. కొనేళ్లుగా సరైన సక్సెస్ లేక కెరీర్ లో చాలా వెనక పడ్డ షారుఖ్ పఠాన్ హిట్ తో ఊపిరి పీల్చుకున్నాడు.

ఇక తనయుడు హీరోగా ఎంట్రీ ఇస్తే తనను స్టార్ గా నిలబెట్టే వరకు తనకు సపోర్ట్ గా నిలబడాల్సి ఉంటుంది. కానీ ఆర్యన్ ఖాన్ ఎలాగు డైరెక్టర్ గా ఫిక్స్ అయ్యాడు కాబట్టి పెద్ద ఇబ్బంది ఏమి లేదు. ప్రస్తుతం షారుఖ్ ఖాన్ అట్లీ డైరెక్షన్ లో జవాన్ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కూడా క్యామియో రోల్ చేస్తున్నాడని టాక్. కోలీవుడ్ లో విజయ్ తో వరుస హిట్లు అందించిన అట్లీ బాలీవుడ్ బాద్షాతో పెద్ద టార్గెట్ పెట్టుకున్నాడు.

పఠాన్ తో మరోసారి తన స్టామినా ఏంటో చూపించిన షారుఖ్ జవాన్ తో సౌత్ లో కూడా తన మార్కెట్ పెంచుకోవాలని చూస్తున్నాడు. అట్లీ సినిమాలకు తెలుగులో కూడా మంచి డిమాండ్ ఉంది. కాబట్టి అట్లీ షారుఖ్ మూవీ తెలుగులో కూడా దుమ్ము దులిపేస్తుందని చెప్పొచ్చు.