గంగా పుష్కరాల సందర్భంగా వారణాసిలోని శివాల గాట్ వద్ద తానా ఆధ్వర్యంలో నాలుగవ రోజు మంగళవారం నాడు పెద్ద ఎత్తున అన్నదానం జరిపారు. ఈ అన్నదానాన్ని స్వీకరించడానికి వచ్చే వారి సంఖ్య ప్రతిరోజు పెరుగుతోంది.
దాదాపు పది రకాల వంటలతో పాటు కూలింగ్ వాటర్ ప్యాకెట్లు మజ్జిగ ప్యాకెట్లు ఇస్తూ ఉండటంతో అన్నదాన శిబిరం వద్ద యాత్రికుల తాకిడి పెరుగుతోంది. ముఖ్యంగా పోలీస్ మున్సిపల్ ఆరోగ్య తదితర శాఖలకు చెందిన ఘాటులలో పుష్కర విధులు నిర్వహిస్తున్న అధికారులు సిబ్బంది తానా అన్నదాన శిబిరం వద్దకు వచ్చి భోజనం చేస్తున్నారు. మంచి భోజనాన్ని అందిస్తున్న తానా సభ్యులను అభినందిస్తున్నారు. స్థానిక మున్సిపల్ కార్పొరేటర్ అన్నదాన శిబిరం వద్దకు వచ్చి భోజనం స్వీకరించి అభినందనలు అందించారు.
వారణాసి నుండి కిలారు ముద్దుకృష్ణ