బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అలియా భట్ మరో భారీ కొనుగోలుతో వార్తల్లో నిలిచింది. ఏకంగా 37 కోట్ల రూపాయల విలువైన నూతన ఇంటిని ఈమె కొనుగోలు చేసినట్టుగా తెలుస్తోంది.
తనకు సంబంధించిన ప్రొడక్షన్ హౌస్ పేరిట అలియా భట్ ఈ ఖరీదైన ఇంటిని కొనుగోలు చేసింది. ఇందుకు సంబంధించి స్టాంప్ డ్యూటీనే 2.26 కోట్ల రూపాయలు చెల్లించిందట అలియా. ఈ భారీ కొనుగోలుతో అలియా ఇలా వార్తల్లో నిలుస్తోంది.
ఇప్పటికే అలియా భట్ కు సొంత ఇళ్లున్నాయి. తన భర్త రణ్ బీర్ కపూర్ తో కలిసి ఒక ఎనిమిదస్తుంతల సొంత భవనాన్ని కూడా ఆమె కట్టుకుంటోంది. ఒకవైపు అలా ఆ ఇల్లు నిర్మాణంలో ఉండగానే, ఇలా తన సొంత సినీ నిర్మాణ సంస్థ పేరిట అలియా భట్ ముంబైలో 37 కోట్ల రూపాయల విలువైన ఇల్లు కొనుగోలు చేయడం గమనార్హం.
ఇదే సమయంలో తన పేరిట ఉన్న రెండో ఫ్లాట్లను తన సోదరికి విక్రయదానం చేసింది అలియా. ఇందుకు సంబంధించి కూడా ముప్పై లక్షల రూపాయల స్టాంప్ డ్యూటీనే అలియా కుటుంబం చెల్లించినట్టుగా తెలుస్తోంది.
తన సోదరి షహీన్ పేరిట అలియా భట్ బదిలీ చేసిన రెండు ఫ్లాట్ల విలువ సుమారు 7.68 కోట్ల రూపాయల విలువ ఉండవచ్చని తెలుస్తోంది. ఇలా తన పేరిట ఉన్న ఇళ్లను సోదరికి గిఫ్ట్ గా ఇస్తూ, మరోవైపు భారీ పెట్టుబడితో కొత్తింటిని ఆమె కొనుగోలు చేయడం గమనార్హం.
ప్రస్తుతం దేశంలో మోస్ట్ వాంటెడ్ నటీమణుల జాబితాలో అలియా భట్ ముందు వరసలో ఉంది. స్టార్ హీరోయిన్ గా చేతి నిండా అవకాశాలతో, భారీ రెమ్యూనిరేషన్లతో ఆమె దూసుకుపోతోంది. ఇదే తరుణంలో ఇలాంటి రియల్ ఇన్వెస్ట్ మెంట్స్ తో ఈ హీరోయిన్ తన ప్లానింగ్ ను చాటుకుంటోంది.