Movies

వీరమల్లు’ కోసం మరోసారి సింగర్ గా మారుతున్న పవన్!

వీరమల్లు’ కోసం మరోసారి సింగర్ గా మారుతున్న పవన్!

షూటింగు దశలో ఉన్న ‘వీరమల్లు’ పవన్ తో పాట పాడించే ప్రయత్నంలో క్రిష్ త్వరలో రికార్డు చేయనున్న కీరవాణి,కథానాయికగా సందడి చేయనున్న నిధి అగర్వాల్

పవన్ కల్యాణ్ హీరోగా చేస్తున్న ‘హరి హర వీరమల్లు’ సినిమా చాలా రోజులుగా సెట్స్ పైనే ఉంది. క్రిష్ దర్శకత్వంలో ఎ.ఎమ్.రత్నం నిర్మిస్తున్న ఈ సినిమా, కొన్ని కారణాల వలన ఆలస్యమవుతూ వస్తోంది. ఇక సాధ్యమైనంత త్వరగా ఈ సినిమాను పూర్తిచేసే పనిలో పవన్ ఉన్నారు. ఆ దిశగానే ప్రాజెక్టులో మళ్లీ కదలిక మొదలైంది.

ఈ సినిమాలో పవన్ కల్యాణ్ తో ఒక పాట పాడించే ఆలోచన క్రిష్ చేశాడట. ఆ పాటను పవన్ పాడితేనే బాగుంటుందని భావించి, ఆయనను ఒప్పించాడని అంటున్నారు. పవన్ కి తగినట్టుగా కీరవాణి ట్యూన్ చేశారని చెబుతున్నారు. సినిమాలో ఒక కీలకమైన సందర్భంలో ఈ పాట వస్తుందని అంటున్నారు. ఈ పాటను రికార్డు చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయని సమాచారం.

గతంలో పవన్ ‘తమ్ముడు’ .. ‘ గుడుంబా శంకర్’ .. ‘జానీ’ .. ‘అత్తారింటికి దారేది’ .. ‘అజ్ఞాతవాసి’ సినిమాల కోసం పాడారు. ఆయన పాడిన ఆ పాటలు ఆ సినిమాలకి ప్రత్యేకమైన ఆకర్షణగా నిలిచాయి. అలాగే ‘వీరమల్లు’ సినిమాలోని పవన్ పాట కూడా ఒక రేంజ్ లో పాప్యులర్ అవుతుందని భావిస్తున్నారు. ఈ సినిమాలో కథానాయికగా నిధి అగర్వాల్ అలరించనుంది.