జహ్నుఋషి చెవి నుండి గంగ బయటికి వచ్చిన దినము కావున ఈ సప్తమీ
జహ్నుసప్తమీ అని ప్రసిద్ధి చెందెను.
🌸 సేతుమాధవ బిందు మాధవుని
పూజ, గంగస్నానము చేసినచో
జన్మము ధన్యమగును.
🌿 గంగ నింపిన పాత్రను, వస్త్రము,
గాజులు, పసుపు, కుంకుమ,
పానకము, వడపప్పు, ఫలములను
దానము చేసినచో గంగాదేవి
సౌభాగ్యాన్ని, ఆరోగ్య భాగ్యాలను
కరుణిస్తుంది.
🌸శ్రీనివాసుడు కుబేరుని ద్వారా తన
వివాహమునకై ధనమును అప్పుగా
స్వీకరించినది ఈ రోజునే.
జలకుంభ దానమును ఈ రోజు
చేయవలెను.
🌹కమలవ్రతము:- 🌹
🌿వైశాఖ శుక్ల సప్తమిన కమలవ్రతము ఆచరణ చేయవలెను. సువర్ణ నాణ్యాన్ని కుంభములో వేసి, ఆ కుంభములో నువ్వులను నింపి, దాని పైన రెండు వస్త్రాలను కప్పి గంధ- ధూపాదులతో సూర్యనారాయణుని
అర్చించవలెను.
🌸”నమస్తే పద్మ హస్తాయ నమస్తే విశ్వధారిణే దివాకర నమస్తుభ్యం
ప్రభాకర నమోస్తుతే”
🌿ఈ విధముగా ప్రార్థించి సూర్యుడు
అస్తమించిన తరువాత ఆ కుంభాన్ని బ్రాహ్మణునికి దానము చేయవలెను.
🌸ఈరోజు ఉపవాసము
చేసి మరుసటి రోజు బ్రాహ్మణులకు
భోజనము చేయించినచో
సూర్యలోక ప్రాప్తి,
ఆయురారోగ్యాదులు లభిస్తాయి.
🌹నింబవ్రతం:- 🌹
🌿ఈరోజు వేపాకులతో
సూర్యుని పూజించవలెను. ‘ఓం
ఖరోల్యాయనమః ఓం’ అని
మంత్రము ఉచ్ఛరిస్తూ పూజచేసి
వేపాకును భుజించి ఉపవాసము
చేసి, మరుసటి రోజున బ్రాహ్మణ
భోజనానంతరము భోజనము
చేయవలెను. ఈ వ్రతము వలన
ఆరోగ్యాభివృద్ధి కలుగును.
🌹శర్కరావ్రతం:- 🌹
🌸చక్కెర సూర్యుని ద్వారా పుట్టినందున సూర్యునికి అతిప్రీతి. హవ్యకవ్యాలలో
చక్కెరను చాలా ఉపయోగిస్తారు.
🌿ఈరోజున చక్కెర దానము, చక్కెరతో తయారుచేసిన భక్ష్యాలను బ్రాహ్మణునికి దానముచేసినచో సూర్యుడు సంతుష్టుడై సమస్త దుఃఖములు పరిహారమై పుత్ర సంతానము వృద్ధియగును…
నేడు సప్తమి, పుష్యమి నక్షత్రం కలసి ఒక ప్రత్యేక యోగం ఏర్పడుతుంది….!!🙏🌹
🌷”అమావాస్యేతుసోమేన సప్తమీ భానునాయుతా చతుర్థీ భౌమవారేణ సూర్యగ్రహణసన్నిభా:!
స్నానందానంతథాశ్రాద్ధం సర్వంతత్రాక్షయంభవేత్!!
తిథివార సమాయోగో యదాకాలేభవేదిహ/ప్రభాతేవాథ మధ్నాహ్న పుణ్యకాలన్సనాస్యదా ?🌷
🌸తా॥ సోమవారముతోగూడిన ఆమావాస్య, ఆదివారముతోగూడిన సప్తమి, మంగళవారముతోగూడిన చవితి, బుధవారముతోగూడిన అష్టమి,
🌿ఈ నాలుగింటికి మహాపర్వత యోగములు అని పేరు. ఇవి సూర్యగ్రహణతుల్యములు.
🌸ఈరోజుల్లో చేసిన గంగాస్నానము, దానం జపం ఉపాసన శ్రాద్ధము.. మొ||వి అక్షయ ఫలాన్ని ఇస్తాయి.
🌷శ్లో॥”” సంక్రాన్తిషు వ్యతీపాతే గ్రహణే చన్ద్రసూర్య్యయోః, పుష్యే స్నాత్వాతు జాహ్నవ్యాం కులకోటి: సముద్ధరేత్..” అని బ్రహ్మాణపురాణమ్”🌷
🌿పుష్యమి నక్షత్ర యుక్తమైన ఈ రోజు గంగా స్నానం
🌸చేయడం వల్ల వంశం పావనం అవుతుందని అర్థం.
🌷”శృణు రాజన్ ! ప్రవక్ష్యామి పుష్యస్నానవిధిక్రమమ్ యేన విజ్ఞాతమాత్రేణ విఘ్నా నశ్యని సన్తతమ్.. ఖానౌ పుష్యర చ పుష్యస్నానం నరశ్చరేత్, సౌభాగ్యకల్యాణకరం దుర్భిక్షమరకాపహమ్.. గ్రహదోషాశ్చ జాయనే యది రాజ్యేషు చేతయః, తదా పుష్యర్క మాత్రే తు కుర్య్యానాసా రేవ్ తల్🌷
🌿అంటూ శాస్త్ర గ్రంథాలు చెబుతున్న దాన్ని బట్టి..
🌸ఈరోజు చేసే గంగాస్నానం వల్ల ఎంతో కాలంగా ఉన్న విఘ్నాలు, గ్రహదోషాలు, ఆర్థిక బాధలు తొలగిపోయి సౌభాగ్య కళ్యాణ కరమైన మంచి ఫలితాలు సిద్ధిస్తాయని అర్థం.
🌿గౌతమఋషి తపస్సువల్ల గంగాదేవియే గోదావరిగా అవతరించి కాబట్టి ఈరోజు గోదావరి స్నానం.. వీలైనంత భగవత్ ఆరాధన, దానం వంటివాటి వల్ల మంచి ఫలితాలు కలుగుతాయి.
🌸గమనిక ఏమిటంటే.. ఇలాంటి ప్రత్యేక యోగాలు ఉన్న రోజుల్లో చేసే పాపాలు, లేదా తప్పుడు పనుల యొక్క దోషఫలం కూడా అనేక రెట్లుగానే ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి…