పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తాజాగా నటిస్తున్న సినిమాల్లో హరీష్ శంకర్ దర్శకత్వంలో చేస్తోన్న ఉస్తాద్ భగత్ సింగ్ కూడా ఒకటి. శ్రీలీల హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీకి రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తుండగా మైత్రి మూవీ మేకర్స్ సంస్థ దీనిని గ్రాండ్ లెవెల్లో నిర్మిస్తోంది. కొన్నేళ్ల క్రితం పవన్, హరీష్ ల కాంబినేషన్ లో వచ్చిన గబ్బర్ సింగ్ మూవీ పెద్ద హిట్ అందుకోవడంతో పవన్ ఫ్యాన్స్ లో ఆడియన్స్ లో ఉస్తాద్ భగత్ సింగ్ పై భారీ స్థాయిలో అంచనాలు ఏర్పడ్డాయి.
కొన్నాళ్ల నుండి శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ మూవీకి సంబంధించి తాజా అప్ డేట్ ప్రకారం తాజగా హైదరాబాద్ లో ప్రారంభించిన షెడ్యూల్ పూర్తి కావడంతో యూనిట్ ఎడిటింగ్ కార్యక్రమాలు ప్రారంభించిందట. పవన్ కళ్యాణ్ ని మరొకసారి పవర్ఫుల్ రోల్ లో హరీష్ శంకర్ చూపించనుండగా తప్పకుండా మూవీ అందరి అంచనాలు అందుకుని బాక్సాఫీస్ దగ్గర భారీ విజయం అందుకోవడం ఖాయం అని యూనిట్ ఆశాభావం వ్యక్తం చేస్తోంది.