DailyDose

గోడలకు ఎటువంటి ఫోటోలు అమర్చాలి…!!

గోడలకు ఎటువంటి ఫోటోలు అమర్చాలి…!!

🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿

🌿సాధారణంగా గృహంలోని తూర్పు పడమర ఉత్తర దక్షిణ గోడలకు ఏదైనా ఫోటోలు అమరుస్తూ ఉంటారు.

🌸హాల్లో కానీ బెడ్ రూమ్ లో కానీ
ఏ గోడకు ఎటువంటి  ఫోటో తగిలించడంవలన  అదృష్టము ధనము కలిసి వస్తుందో చూద్దాం.

🌿దక్షిణ గోడకు కొంగ ఫోటో కానీ పోస్టర్ కానీ తగిలించడం వలన ఆ గృహంలో ఆయుష్ పెరుగుతుంది. ఆనందం పెరుగుతుంది కుటుంబ సభ్యుల మధ్య సఖ్యత పెరుగుతుంది.

🌸 అదేవిధంగా ఉత్తర గోడకు హంస ఫోటో ఉంచడం వలన పిల్లలు బాగా చదువుతారు.

🌿హంస శివ స్వరూపము.
నల దమయంతులకు శివుడు హంస రూపంలో రాయబారం చేసినట్టు పురాణ గాధతెలియజేస్తుంది.

🌸 హంస శివస్వరూపము శివుడు గురు స్థానాధిపతి కావున హంస ఫోటో ఉన్నట్లయితే పిల్లల చదువు విషయంలో కానీ జ్ఞానo విషయంలో కానీ ఉత్తమ స్థాయిలో అభివృద్ధి చెందుతారు.

🌿అదేవిధంగా పడమర గోడకు అలివేలుమంగా పద్మావతి సమేత వెంకటేశ్వర స్వామి ఫోటో అమరచడం వలన గృహంలో సుఖసంతోషాలతో పాటు ధనాభివృద్ధి కీర్తి ప్రతిష్ట లభిస్తాయి.

🌸 పడమర దిక్కు శని భగవానునికి స్థానము శని భగవానునికి అతి దేవత వెంకటేశ్వర స్వామి కావున పడమర గోడకు వెంకటేశ్వర స్వామి ఫోటో అమర్చండి.

🌿దక్షిణం గోడకు గరుత్మంతుని ఫోటో అమర్చాలి. దక్షిణ నైరుతి కానీ పశ్చిమ నైరుతి గాని ఈ భాగంలో జంట బాతులు ఫోటో అమర్చండి దీనివలన గృహంలో దాంపత్య అనుకూలత ఏర్పడుతుంది.

🌸వివాహం కాని వారికి తొందరగా వివాహం జరిగే అవకాశం ఉంది.
ఈ మధ్యకాలంలో చాలామంది వెదురు చెట్టు అలంకరణగా ఉంచుతున్నారు. ఈ వెదురు చెట్టు చిన్న మొక్క రూపంలో చాలా చోట్ల లభిస్తుంది

🌿ఈ మొక్కను దక్షిణ ఆగ్నేయ భాగంలో ఉంచినట్లయితే జీవితంలో ఎటువంటి సమస్యలు వచ్చినప్పటికీ కూడా ధైర్యంగా ఎదుర్కొని నిలబడగలుగుతారు మంచి నిర్ణయాలు తీసుకోగలుగుతారు.

🌸చాలామంది వ్యాపార స్థలంలోనూ ఆఫీసుల్లోనూ వెదురు మొక్కను టేబుల్ పై ఉంచుతున్నారు. టేబుల్ పై ఉంచిన ఈ మొక్కను దక్షిణ ఆగ్నేయ భాగంలో ఉండే విధంగా అమర్చుకోండి.

🌿 మీరు తీసుకుని నిర్ణయాలు చాలా దృఢంగా ఉంటాయి ఎటువంటి ఆటుపోట్లు అయినా ఎదుర్కొని సమర్థవంతంగా నిలబడగలుగుతారు. వెదురు మొక్క అదృష్టాన్ని తీసుకొస్తుంది..