రణ్ బీర్ కపూర్ అలియా భట్ లకు రీసెంట్ గానే ఒక పాప పుట్టిన విషయం తెలిసిందే. ప్రస్తుతం రణ్ బీర్ అలియా పేరెంటింగ్ ఫీల్ ని ఎంజాయ్ చేస్తున్నారు. కొద్దిగా టైం దొరికితే చాలు కూతురితో ఆడుకుంటున్నారట. రణ్ బీర్ అలియాల కూతురికి రాహా అనే పేరు పెట్టారు.
తల్లిగా అలియా చాలా వరకు రాహాతోనే ఉంటుందట కానీ రణ్ బీర్ మాత్రం వరుస సినిమాల వల్ల కూతురిని ఎక్కువ మిస్ అవుతుంటాడట. దూరంగా ఉంటే కూతురు తనను మర్చిపోతుందని టెన్షన్ పడుతున్నాడట రణ్ బీర్. ఈ విషయాన్ని అలియా స్వయంగా తన సోషల్ మీడియాలో షేర్ చేసింది.
రాహా ఎప్పుడూ నవ్వుతూ ఉండటం చూసి మాకు ఎంత పని ఒత్తిడి ఉన్నా సరే అవన్ని తొలగిపోతాయని అంటుంది అలియా. తనను దగ్గరకు తీసుకుని హత్తుకోవడం కన్నా ముఖ్యమైనది ఏది లేదని అనిపిస్తుంది. ఇక రణ్ బీర్ చాలా సెన్సిటివ్ రాహా పుట్టాక అతను మరింత సెన్సిటివ్ అయ్యాడు.
కూతురు అంటే అతనికి చాలా ఇష్టం రాహా కోసం రణ్ బీర్ అప్పుడప్పుడు జంతువులా మారుతుంటాడు. రాహాను అతను ఆడిస్తుంటే చాలా ముచ్చటగా ఉంటుందని అంటుంది అలియా భట్.
రణ్ బీర్ ఆడిస్తుంటే రాహా తన దగ్గరకు రమ్మనా సరే రాదు. కూతురితో విండో దగ్గర కూర్చుని టైం స్పెండ్ చేస్తాడు రణ్ బీర్. రణ్ బీర్ లేని టైం లో రాహాని తను అక్కడే కూర్చోబెట్టుకుని ఆడిస్తానని అంటుంది అలియా. రణ్ బీర్ షూటింగ్ లో ఎక్కడికైనా వెళ్తే కూతురు తనని మర్చిపోతుందని భయపడుతుంటాడని అంటుంది అలియా. పేరెంటల్ ఫీలింగ్ అనేది ఒక గొప్ప అనుభూతి ప్రస్తుతం బాలీవుడ్ స్టార్ కపుల్ ఆ అనుభూతిని ఆస్వాదిస్తున్నారు.
బ్రహ్మాస్త్రతో కలిసి పనిచేసిన రణ్ బీర్ అలియా మళ్లీ ఆ సినిమా సీక్వెల్ లో కలిసి నటించనున్నారు. ప్రస్తుతం రణ్ బీర్ కపూర్ సందీప్ వంగా తో యానిమల్ సినిమా చేస్తున్నాడు. ఆ సినిమా ఈ ఏడాది చివర్లో రిలీజ్ కాబోతుంది.