Editorials

దేవాలయల అవశ్యకత వుందా…??

దేవాలయల అవశ్యకత వుందా…??

🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿

🌿మనదేశంలో ప్రతిగ్రామంలోను కనీసం ఒక దేవాలయమైన ఉంటుంది, దేవాలయం లేని గ్రామం లేదంటే అతిశయోక్తి కాదు…

🌸ఈ సంప్రదాయం ఎప్పటి నుంచి అమలులోకి వచ్చింది..
అలా ప్రతి గ్రామంలోనూ దేవాలయాన్ని నిర్మించు కోవలసిన అవసరమేమిటి…

🌿ఒక వేళ దేవాలయంలేని గ్రామమున్నట్లయితే ఏమవుతుంది…
ఇటువంటి ప్రశ్నలన్నిటికీ ఇలా సమాధానం చెప్పుకోవచ్చు,

🌸 ప్రతియొక్కరికీ మానసిక ప్రశాంతత స్థిరచిత్తంతో జీవించాలని ఉంటుంది.
దేవుని కటాక్షం లేకుండా అటువంటి జీవితం లభ్యమవటం అసాధ్యం, దేవుని కటాక్షం లభించాలంటే దేవాలయాలు అవసరం…

🌿సనాతన ధర్మంలో వాస్తవానికి దేవుడు లేని చోటు లేదు, భగవంతుడు సర్వాంతర్యామి, మరి దేవుడు సర్వాంతర్యామి అయినట్లయితే దేవాలయాలెందుకు..

🌸ఒక దేవాలయంలో దేవుని బందించి, ఆయన సర్వవ్యాపకత్వానికి పరిమితులను ఏర్పరుస్తున్నాము కదా…

🌿ఇటువంటి సందేహాలను లేవనెత్తే వారు పూర్తిగా ఏమి తెలియను వారు కాదు, అయితే వాళ్లు సత్యాన్ని సమగ్రంగా అర్ధం చేసుకోలేదు, అందువలనే ఇటువంటి సందేహాలు తలెత్తుతుంటాయి…

🌸పరమాత్మా సర్వాంతర్యామి అనటంలో ఇటువంటి సందేహం లేదు, అయితే తగు అవగాహన, సంస్కారం లేని కారణంగా సామాన్యులు పరమాత్మ సర్వాంతర్యామి అనే విషయాన్ని హృద్గతం చేసుకోలేక పోతున్నారు…

🌿 అయితే అటువంటి అవగాహన సంస్కారం ప్రహ్లాదుని వంటి మహాపురుషులకే ఉంటుంది, మహాభక్తుడైన ప్రహ్లాదునికి ప్రతిచోటా దైవదర్శనం భాగ్యం లభించేదని శ్రీమద్భాగవతం ద్వారా మనకు తెలుస్తోంది,

🌸అయితే సామాన్యులు ప్రహ్లాదునికున్న సంస్కారాన్ని, అధికారాన్ని కలిగి ఉండరుకదా!! అయితే దైవ భక్తిని పెంపొందించుకోవడానికి సామాన్యులు ఏమిచేయాలి???…

🌿మన పూర్వీకులు మనకి చాల మార్గాలను సూచించారు, శాస్త్రాలు నిర్దేశించిన ప్రకారం ప్రాణప్రతిష్ట చేయబడిన దేవత విగ్రహాలను పూజిస్తే తప్పకుండా దైవకటాక్షం లభిస్తుందని శాస్త్ర వచనం,

🌸పామరులు కూడా సులభమైన ఈ మార్గాన్ని అవలంబించి దైవ కటాక్షాన్ని పొందవచ్చు…

🌿ఒక దేవాలయంలో దేవుని బందించి ఆయన సర్వవ్యాపకత్వానికి పరిమితులను ఏర్పరుస్తున్నాము కదా అనే సందేహం అడగవచ్చు .

🌸దీనికి శ్రీ శంకరాభగవత్పాదుల వారు ఒక ఉదాహరణ చెప్పారు…

🌷”యధా సకల భూమండలాధిపతి రపి అయోధ్యాపతిః ఇతి వ్యవహ్రియతే”🌷

🌿భూమండలాధిపతి అయిన శ్రీరామచంద్రమూర్తిని అయోధ్యాధిపతిగా అభివర్ణిస్తున్నాము, అంతమాత్రాన ఆయన అధికారం తగ్గిపోతుందా..!!

🌸ఆయన అయోధ్యాపతి మాత్రమే కాదు, లోకాధిపతి కూడాను…
అలాగే పరమాత్మా ఇతరచోట్ల ఉన్నట్లే దేవాలయంలో కూడా ఉంటాడు.
అయితే దేవుడిని అన్వేషించే వారి సౌలభ్యం కోసం ఒక స్థానాన్ని చూపించాలని దేవాలయాన్ని దైవస్థానంగా చూపిస్తాం, దేవాలయంలో దేవుని ఆరాధన ద్వారా

🌿మనం మానసిక ప్రశాంతత పొందవచ్చు…ప్రహ్లాదుని వంటి శ్రద్ధా భక్తులు అధికారికత మీకు కనక ఉన్నట్లయితే, అటువంటి సంస్కారాలను మీరు కూడా పొందగలిగినట్లైతే భగవంతుడిని అన్నిచోట్లా మీరు కూడా దర్శించవచ్చు,

🌸 అప్పుడు మీరు దేవాలయానికే వెళ్లి దేవుడిని పూజించాల్సిన పనిలేదు, ప్రతిచోటు మీకు దేవాలయమే అవుతుంది…

🌿అయితే ప్రహ్లాదుని స్థాయి మనం చేరుకునే దాకా దేవాలయానికి వెళ్లి పూజించక తప్పదు…
అందువలన దేవాలయాలు అవసరమవుతున్నాయి…

🌸మరి మన విన్నపాలను భగవంతుడు పట్టించుకుంటాడా అనే అనుమానానికి ఆస్కారంలేదు. భగవంతుడు అనంతమైన కరుణామూర్తి, శృతి ఇలా వివరించింది….స్వస్తీ..🚩🌞🙏🌹🎻

🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸