బెంగళూరు: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలవేళ తాజా ఒపీనియన్ పోల్ సర్వేలో కాంగ్రెస్ క్లీన్ స్వీప్ చేసింది.
హస్తం పార్టీ స్పష్టమైన మెజారిటీ దక్కించుకుంటుందని సీ డైలీ ట్రాకర్ వెల్లడించింది.
కర్ణాటకలో మొత్తం 224 స్థానాలుండగా కాంగ్రెస్ 157 స్థానాల వరకూ గెలుచుకునే అవకాశం ఉందని స్పష్టం చేసింది.
56 స్థానాలతో బీజేపీ రెండో స్థానంలో, 34 స్థానాలతో జేడీఎస్ మూడో స్థానంలో ఉన్నాయి.
ఇతరులకు సున్నా నుంచి మూడు స్థానాలు దక్కే అవకాశముందని తెలిపింది.
Close PlayerUnibots.in
▪️BJP – 37-56
▪️INC – 130-157
▪️JD(S)- 22-34
▪️OTH – 00 – 03
సీ డైలీ ట్రాకర్ వెల్లడించిన ప్రకారం కాంగ్రెస్‌కు 44.4 శాతం, బీజేపీకి 30.6 శాతం, జేడీఎస్‌కు 18 శాతం, ఇతరులకు 7 శాతం ఓట్ షేరింగ్ దక్కనుంది.
ఏబీపీ-సీ ఓటర్ నిర్వహించిన ఒపీనియన్ పోల్ సర్వేలో కూడా కాంగ్రెస్ స్పష్టమైన మెజారిటీ దక్కించుకునే దిశగా అడుగులు వేస్తున్నట్టు కనిపిస్తోంది.
ప్రస్తుత ఎన్నికల్లో కాంగ్రెస్ సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరిస్తుందని ఈ సర్వే స్పష్టం చేసింది.
సర్వే ప్రకారం..బీజేపీకి 74-86 స్థానాలు, కాంగ్రెస్ 107-119 సీట్లు, జేడీఎస్ 23-35 స్థానాలు, ఇతరులు 5 స్థానాల్లోనూ విజయం దక్కించుకునే అవకాశం ఉంది. అదేవిధంగా ఓట్ షేరింగ్ విషయానికి వస్తే.. బీజేపీ 35శాతం, కాంగ్రెస్ 40శాతం, జేడీఎస్ 17శాతం, ఇతరులు 8శాతం పొందొచ్చని సర్వే తెలిపింది. ఓట్ల షేరింగ్ విషయంలో బీజేపీ.. కాంగ్రెస్ కంటే 5శాతం వెనుకబడడం గమనార్హం.
కర్ణాటక స్థానిక మీడియా ‘ఈ-దిన’ చేపట్టిన సర్వేలోనూ కాంగ్రెస్ వైపే ప్రజలు మొగ్గు చూపుతున్నట్టు తేలింది.
కాంగ్రె్‌సకు 134-140 సీట్లు దక్కే అవకాశం ఉందని తెలిపింది.
కర్ణాటక లో మే 8 నాటికి ఎన్నికల ప్రచారం పూర్తవుతుంది.
మే 10న ఎన్నికలు నిర్వహించనున్నారు. ఓట్ల లెక్కింపు మే 13న జరుగుతుందని ఎన్నికల కమిషన్ ప్రకటించింది.