Business

లిక్కర్ స్కాం డబ్బులతో భూములు కొన్నారు: ఈడీ

లిక్కర్ స్కాం డబ్బులతో భూములు కొన్నారు: ఈడీ

ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో వంద కోట్ల ముడుపులపై ఆధారాలు లభించాయని ఈడీ కోర్టులో వేసిన మూడవ చార్జీషీట్లో పేర్కొంది. ఎమ్మెల్సీ కవిత, ఆమె భర్త అనిల్, అరుణ్ పిళ్లైల పేరుమీద ఆస్తులు కొనుగోలు చేశారని అభియోగం మోపింది. ఈ లావాదేవీలు అరుణ్ పిళ్లై ఖాతా నుంచి జరిగాయని తెలిపింది. స్కాం ద్వారా వచ్చిన డబ్బులతో రాజకీయ పలుకుబడిని ఉపయోగించి తక్కువ ధరకే భూములు కొనుగోలు చేశారని వెల్లడించింది