టాలీవుడ్‌లో ఎక్కువ ఫ్యాన్ బేస్ ఉన్న హీరోల్లో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఒకడు. పేరుకు మెగాస్టార్ చిరంజీవి సోదరుడే అయినా తనదైన శైలి సినిమాలతో ప్రత్యేకమైన ముద్రను వేసుకున్న అతడు.. చాలా తక్కువ సమయంలోనే స్టార్‌గా ఎదిగిపోయాడు
అయితే, మధ్యలో రాజకీయాల కోసం సినిమాలకు గ్యాప్ ఇచ్చిన ఈ మెగా హీరో.. ఆ లోటును భర్తీ చేసేందుకు ఇప్పుడు వరుస చిత్రాలతో దూసుకుపోతోన్నాడు. ఇలా ఏకకాలంలోనే పవన్ చేతి నిండా ప్రాజెక్టులతో బిజీగా గడుపుతోన్నాడు. ఇప్పుడతను చేస్తోన్న చిత్రాల్లో ‘OG’ (ఒరిజినల్ గ్యాంగ్‌స్టర్) అనే సినిమా ఒకటి.
‘సాహో’ చిత్రంతో దేశం మొత్తాన్ని తన వైపు చూసేలా చేసుకున్న దర్శకుడు సుజిత్ రూపకల్పనలో పవన్ కల్యాణ్ నటిస్తోన్న చిత్రమే ‘OG’. పవర్‌ఫుల్ కాంబినేషన్‌లో రాబోతున్న ఈ చిత్రం గ్యాంగ్‌స్టర్ స్టోరీతో తెరకెక్కుతోంది. ఇక, ఇటీవలే ఈ సినిమాకు సంబంధించిన రెగ్యూలర్ షూటింగ్‌ను ముంబై నగరంలో మొదలు పెట్టారు. అక్కడ పవన్ కల్యాణ్ సహా కొందరు సినీ ప్రముఖుల కాంబినేషన్‌లో కీలకమైన సన్నివేశాలను చిత్రీకరించారు. అలాగే, ఓ యాక్షన్ సీక్వెన్స్‌ను కూడా పూర్తి చేసుకున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా దీనిపై అధికారిక ప్రకటన వెలువడింది.
ఎంతో ప్రతిష్టాత్మకంగా రాబోతున్న ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ షెడ్యూల్‌ను చిత్ర యూనిట్ తాజాగా పూర్తి చేసుకుంది. ఈ విషయాన్ని నిర్మాణ సంస్థ డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్ ట్విట్టర్ ఖాతా ద్వారా అధికారికంగా వెల్లడించింది. ‘ముంబైలో ఓ బ్లాస్టింగ్ షెడ్యూల్ పూర్తైంది.
మళ్లీ మీరు మునుపటి పవన్ కల్యాణ్‌ను ఇందులో చూస్తారని హామీ ఇస్తున్నాము’ అని తెలిపింది. ఈ మేరకు పవన్ కల్యాణ్ ఫొటోను కూడా షేర్ చేసింది. అందులో ఈ స్టార్ హీరో అదిరిపోయే లుక్కుతో కనిపిస్తున్నాడు. దీంతో ఈ పిక్ చాలా తక్కువ సమయంలోనే వైరల్‌గా మారిపోయింది.
మళ్లీ మీరు మునుపటి పవన్ కల్యాణ్‌ను ఇందులో చూస్తారని హామీ ఇస్తున్నాము’ అని తెలిపింది. ఈ మేరకు పవన్ కల్యాణ్ ఫొటోను కూడా షేర్ చేసింది. అందులో ఈ స్టార్ హీరో అదిరిపోయే లుక్కుతో కనిపిస్తున్నాడు. దీంతో ఈ పిక్ చాలా తక్కువ సమయంలోనే వైరల్‌గా మారిపోయింది