NRI-NRT

కాశీలో దిగ్విజయంగా ముగిసిన ” తానా” అన్నదాన శిబిరం.

కాశీలో దిగ్విజయంగా ముగిసిన  ” తానా”  అన్నదాన శిబిరం.

“తానా” ఆధ్వర్యంలో గంగా పుష్కరాల సందర్భంగా వారణాసిలో 12 రోజులు పాటు నిర్వహించిన అన్నదాన శిబిరం బుధవారం దిగ్విజయంగా ముగిసింది. 12 రోజులపాటు నిర్వహించిన ఈ శిబిరానికి మంచి స్పందన లభించింది. వివిధ ప్రాంతాల నుండి తరలివచ్చిన యాత్రికులతో పాటు పుష్కర విధుల్లో ఉన్న పోలీస్ హెల్త్ తదితర ప్రభుత్వ సిబ్బంది “తానా” శిబిరంలోనే ప్రతినిత్యం అన్నదానాన్ని స్వీకరించారు. ఉదయం అన్నదానం తో పాటు సాయంకాల సమయంలో ప్రతినిత్యం మంచి రుచికరమైన అల్పాహారాన్ని అందించారు.

ఎండలో మండుతున్న వారణాసిలో యాత్రికులకు రుచికరమైన భోజనంతోపాటు కూలింగ్ చేసిన వాటర్ బాటిల్లను మజ్జిగ ప్యాకెట్లను తానా అన్నదాన శిబిరంలో ప్రతినిత్యం అందించారు. స్థానిక విశ్వనాథ మందిరానికి వచ్చే భక్తులకు 30 వేల మంచినీళ్లు సీసాలను సరఫరా చేయడం జరిగింది. ఆలయ అధికారుల నుండి తానాకు మంచి ప్రశంసలు లభించాయి. అన్నదానానికి విరాళాలు ఇచ్చిన సభ్యులకు యాత్రికులు కృతజ్ఞతలు అభినందనలు అందించారు.

వారణాసి నుండి కిలారు ముద్దుకృష్ణ