పోటెత్తిన తెలుగు భక్తులు.
తెలుగు సంఘాల దే కీలక పాత్ర.
వారణాసి నుండి కిలారు ముద్దుకృష్ణ.
వారణాసిలో గత 12 రోజుల నుండి జరిగిన గంగా పుష్కరాలు బుధవారం సాయంత్రం తో ముగిశాయి. ఈ సందర్భంగా కాశీలో ఉన్న అన్ని తెలుగు సంఘాలు, ఆశ్రమాలు, మఠాలు, ఆధ్వర్యంలో స్థానిక కేదార్ ఘాట్ లో ముగింపు ఉత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో తెలుగు యాత్రికులు వివిధ మటల అధిపతులు స్వామీజీలు తెలుగు సంఘాల నిర్వాహకులు హాజరయ్యారు. గంగా నదికి హారతి ఇస్తూ పుష్కరాలకు ముగింపు పలికారు.
* రాజ్యసభ సభ్యుడు కాశీ తెలుగు సమితి గౌరవ అధ్యక్షుడు జీవీఎల్ నరసింహారావు ముగింపు వేడుకలకు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. కాశీ తెలుగు సమితి అధ్యక్షుడు, వి సుందర శాస్త్రి చింతామణి గణపతి ట్రస్ట్ నిర్వాహకుడు చల్లా వెంకట సుబ్బారావు తదితరుల ఆధ్వర్యంలో వేడుకలు జరిగాయి.
* 100 తెలుగు సంఘాల ఆధ్వర్యంలో అన్నదానం.ఈసారి జరిగిన గంగా పుష్కరాలలో తెలుగు వారిదే అగ్రస్థానం. దాదాపు 100 తెలుగు సంఘాల ఆధ్వర్యంలో ప్రతినిత్యం రెండు పూటలా అన్నదానం చేశారు వారణాసిలో గంగా తీరం వెంబడి ఎక్కడ చూసినా తెలుగు యాత్రికుల సందడే కనిపిస్తోంది.
* అమెరికా నుండి తానా సభ్యులు పంపిన విరాళాలతో స్థానిక శివాలఘాట్లో నిర్వహించిన, అన్నదానానికి మంచి స్పందన లభించింది. అన్నదానం తో పాటు అల్పాహారం, చల్లటి మంచినీటి సీసాలు, మజ్జిగ ప్యాకెట్లు, అందించారు. తానా తరపున 30 వేల మంచినీటి సీసాలను, విశ్వనాథ మందిరానికి విరాళంగా అందించారు. పుష్కరాల సందర్భంగా 29వ తేదీన, ప్రధాని మోడీ తెలుగు సంఘాల ప్రతినిధులను ఉద్దేశించి ఆన్లైన్ ద్వారా ప్రసంగించారు. కాశీలో తెలుగువారు అందిస్తున్న సేవలను ప్రధాని మోడీ కొనియాడారు.
ఫోటో రైట్ అప్. వారణాసి కేదార్ ఘాట్ లో తెలుగు సంఘాల ఆధ్వర్యంలో జరిగిన గంగా పుష్కరాల ముగింపు సభలో పాల్గొన్న జీవీఎల్ నరసింహారావు వివిధ ఆశ్రమాల నిర్వాహకులు.