స్టాక్ మార్కెట్లు గురువారం ఒక రేంజులో పెరిగాయి. ప్రమోటర్లు, ఎఫ్‌ఐఐలు, డీఐఐలు చాలా కంపెనీల్లో స్టేక్స్ పెంచుకున్నారు.
స్టాక్ మార్కెట్లు గురువారం ఒక రేంజులో పెరిగాయి. భారీ లాభాల్లో ముగిశాయి. ఆసియా, అంతర్జాతీయ మార్కెట్ల నుంచి మిశ్రమ సంకేతాలు అందాయి. యూఎస్ ఫెడ్ 25 బేసిస్ పాయింట్లు వడ్డీరేటు పెంచినా మన మార్కెట్లపై ఎఫెక్ట్ తక్కువగానే ఉంది. ప్రమోటర్లు, ఎఫ్‌ఐఐలు, డీఐఐలు చాలా కంపెనీల్లో స్టేక్స్ పెంచుకున్నారు. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ (NSE Nifty) 165 పాయింట్లు పెరిగి 18,255 బీఎస్‌ఈ సెన్సెక్స్ (BSE Sensex) 555 పాయింట్లు పెరిగి 61,749 వద్ద ముగిశాయి. డాలర్‌తో పోలిస్తే రూపాయి 3 పైసలు బలపడి 81.80 వద్ద స్థిరపడింది.8
క్రితం సెషన్లో 61,193 వద్ద ముగిసిన బీఎస్‌ఈ సెన్సెక్స్ నేడు 61,258 వద్ద మొదలైంది. 61,119 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 61,797 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. చివరికి 555 పాయింట్ల లాభంతో 61,749 వద్ద ముగిసింది.