Sports

ఐపీఎల్ లో ఇంకెవరికీ లేని రికార్డు సొంతం చేసుకున్న కోహ్లీ

ఐపీఎల్ లో ఇంకెవరికీ లేని రికార్డు సొంతం చేసుకున్న కోహ్లీ

అంతర్జాతీయ క్రికెట్లో అనేక రికార్డులు తిరగరాసిన టీమిండియా బ్యాటింగ్ కింగ్ విరాట్ కోహ్లీ ఐపీఎల్ లోనూ అరుదైన ఘనత అందుకున్నాడు.ఐపీఎల్ లో 7 వేల పరుగుల మైలురాయి చేరుకున్న కోహ్లీ.

225 మ్యాచ్ ల్లో ఈ ఘనత ఐపీఎల్ లో ఈ 7 వేల పరుగులు సాధించింది కోహ్లీ ఒక్కడే,అత్యధిక పరుగుల వీరుల జాబితాలో కోహ్లీ తర్వాత ధావన్,6,536 పరుగులు చేసి రెండో స్థానంలో ఉన్న ధావన్.

2008లో ఐపీఎల్ ప్రారంభమైనప్పటి నుంచి కోహ్లీ బెంగళూరు జట్టును అంటిపెట్టుకునే ఉన్నాడు. ఆర్సీబీ తరఫున కోహ్లీ సాధించిన పరుగుల్లో 50 అర్ధసెంచరీలు, 5 సెంచరీలు ఉన్నాయి. ఈ టోర్నీలో కోహ్లీ 36.59 సగటు నమోదు చేశాడు.

ఇవాళ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, ఢిల్లీ క్యాపిటల్స్ మ్యాచ్ సందర్భంగా కోహ్లీ 7 వేల పరుగులు మార్కును అందుకున్నాడు. ఐపీఎల్ చరిత్రలో ఇన్ని పరుగులు చేసిన బ్యాట్స్ మన్ కోహ్లీ తప్ప మరెవ్వరూ లేరు. 34 ఏళ్ల కోహ్లీ 225వ ఐపీఎల్ మ్యాచ్ లో ఈ ఘనత సాధించాడు.