మాజీ రాజ్యసభ సభ్యులు, కెనడాలో తొలి భారత సాంస్కృతిక రాయబారిగా సేవలందించిన డా. యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ తన కెనడా పర్యటనలో భాగంగా టొరంటోలో పర్యటించారు. టొరంటోలోని భారత రాయబార కార్యాలయం నుండి ఆయన సాంస్కృతిక రాయబారిగా విధులు నిర్వహించారు. ఈ పర్యటనలో స్థానిక ప్రవాస తెలుగువారితో లక్ష్మీప్రసాద్ సమావేశమయ్యారు. కెనడా-దక్షిణ భారత వాణిజ్యమండలి సభ్యులతో ఆయన సమావేశమయ్యారు. టొరంటోతో పాటు కెనడావ్యాప్తంగా దక్షిణ భారతీయులు కెనడా అభివృద్ధికి తోడ్పడుతున్న వివరాలను ఆయన తెలుసుకున్నారు. అనంతరం ఆయన గౌరవార్థం ఏర్పాటు చేసిన విందులో లక్ష్మీప్రసాద్ సతీసమేతంగా కుటుంబసభ్యులతో కలిసి పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంలో బెజవాడ సూర్య, వెలువోలు బసవయ్య, సూరపనేని లక్ష్మీనారాయణ, సామంతపూడి చారి, దేవీ చౌదరి, రాజేష్ (బంజారా), మిస్సిసాగా-మిల్టన్ ఎంపీ దీపక్ ఆనంద్, బాల కందస్వామి, సంతోష్ మాథర్ తదితరులు పాల్గొన్నారు.
కెనడా: టొరంటో ప్రవాస తెలుగువారితో యార్లగడ్డ భేటీ
Related tags :