భారత మార్కెట్లోకి రిలీజ్ అయ్యే అన్ని స్మార్ట్‌ఫోన్లలో ఇకపై ఎఫ్ఎం రేడియో ఫీచర్ డిఫాల్ట్‌గా తప్పక ఉండాల్సిందే.. స్మార్ట్‌ఫోన్‌లలో FM రేడియోను సులభంగా యాక్సెస్ చేసేందుకు భారత ప్రభుత్వం మొబైల్ ఫోన్ తయారీదారులకు అడ్వైజరీని జారీ చేసింది. ముఖ్యంగా అత్యవసర పరిస్థితులు, విపత్తుల సమయంలో ప్రజలకు రేడియో సర్వీసుల ద్వారా సమాచారం, వినోదాన్ని అందించాలనే ఉద్దేశంతోనే ప్రభుత్వం ఈ చర్యలు చేపట్టినట్టు తెలుస్తోంది.
డిజిటల్ విభజనను తగ్గించడంతో పాటు స్వతంత్ర రేడియో సెట్‌లను కొనుగోలు చేయలేని గ్రామీణ, మారుమూల ప్రాంతాల ప్రజలకు రేడియో సర్వీసులను అందుబాటులోకి తీసుకురావాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇందులో భాగంగానే మొబైల్ తయారీదారులకు తమ ఫోన్లలో తప్పనిసరిగా ఎఫ్ఎం రేడియా సర్వీసులు తప్పక ఉండాలని సూచించింది.
IT మంత్రిత్వ శాఖ ఇండియన్ సెల్యులార్ అండ్ ఎలక్ట్రానిక్స్ అసోసియేషన్ , మాన్యుఫ్యాక్చరర్స్ అసోసియేషన్ ఫర్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ లకు అత్యవసర పరిస్థితులు, విపత్తుల సమయంలో FM రేడియో అందుబాటులో ఉండాలే చూడాలని అడ్వైజరీ జారీ చేసింది. ఈ అడ్వైజరీ ద్వారా పేదలకు రేడియో సర్వీసులను అందించడమే కాకుండా క్లిష్ట సమయాల్లో ప్రతి ఒక్కరికీ FM కనెక్టివిటీ అందుబాటులో ఉండేలా చూడటమే లక్ష్యంగా పెట్టుకుంది.
మొబైల్ ఫోన్‌లో ఇన్‌బిల్ట్ FM రేడియో రిసీవర్ ఫంక్షన్ లేదా ఫీచర్ ఉన్న చోట.. ఆ ఫంక్షన్ లేదా ఫీచర్ డిసేబుల్ కాదు లేదా డియాక్టివేట్ కాదు. అయితే, మొబైల్ ఫోన్‌లో ఎనేబుల్/యాక్టివేట్ అయినట్టుగా ఫోన్ మేకర్లు నిర్ధారించుకోవాలి. ఇంకా, మొబైల్ ఫోన్‌లలో FM రేడియో రిసీవర్ ఫంక్షన్ లేదా ఫీచర్ అందుబాటులో లేకుంటే.. వెంటనే ఫోన్లలో ఫీచర్ చేర్చవచ్చని సూచించింది”అని ఐటి మంత్రిత్వ శాఖ అడ్వైజరీ తెలిపింది.