బహ్రెయిన్ ఇండియన్ ఎంబసీకి చెందిన ఇండియన్ కమ్యూనిటీ రిలీఫ్ ఫండ్ (ఐసీఆర్ఎఫ్) సభ్యులు, స్థానిక ఎన్నారైలు తాజాగా విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి వి, మురళీధరన్‌తో సమావేశమయ్యారు.
బహ్రెయిన్ ఇండియన్ ఎంబసీకి చెందిన ఇండియన్ కమ్యూనిటీ రిలీఫ్ ఫండ్ (ఐసీఆర్ఎఫ్) సభ్యులు, స్థానిక ఎన్నారైలు తాజాగా విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి వి.మురళీధరన్‌తో సమావేశమయ్యారు. ఈ సందర్భంగాబహ్రెయిన్లో దక్షిణాది రాష్ట్రాల వారు ఎదుర్కొంటున్న పలు సమస్యలను ఎన్నారైలు మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన వారిని చట్టవ్యతిరేకంగా ఇళ్లల్లో పనులకు నియమించుకోవడం, భారత్‌లోని వివిధ నగరాలకు విమాన సర్వీసులకు సంబంధించిన సమస్యలను మంత్రికి వివరించారు.
మనమ వేదికగా జరిగిన ఈ సమావేశంలో స్థానిక భారతీయ సామాజిక కార్యకర్తలు, ఇతర ప్రముఖులు పాల్గొన్నారు. ‘‘హౌస్‌మెయిడ్స్ నియామకానికి సంబంధించి మరింత పారదర్శకత, బాధ్యతాయుత వైఖరి అవలంబించాల్సిన విషయాన్ని మంత్రి దృష్టికి తీసుకెళ్లాం’’ అని ప్రముఖ సామాజిక కార్యకర్త డి.శివకుమార్ ఈ సందర్భంగా పేర్కొన్నారు. పనిమనుషులుగా చేరేందుకు బహ్రెయిన్‌కు వచ్చి చిక్కుకుపోయిన భారతీయ మహిళలను సురక్షితంగా స్వదేశానికి తరలించడంలో భారత ఎంబసీ చేస్తున్న కృష్టిని డి. శివకుమార్ ప్రశంసించారు. కాగా, ఈ సమావేశంలో తెలుగు కళాసమితికి చెందిన నోముల మురళి, విదేశీ వ్యవహారాల శాఖ గల్ఫ్ రీజియన్ జాయింట్ సెక్రెటరీ విపుల్, రాయబారి పీయష్ శ్రీవాత్సవ్, దౌత్యాధికారులు ఎజాజ్ అహ్మద్, రవి శంకర్ శుక్లా పాల్గొన్నారు.