టెక్సాస్ లోని ప్రీమియం మాల్ లో నిన్న జరిగిన కాల్పుల్లో 8 మంది మరణించారు. వారిలో రంగారెడ్డి జిల్లాకు చెందిన 27 సంవత్సరాల తాటికొండ ఐశ్వర్య ఉన్నారు. ఐశ్వర్య మృతి పట్ల స్థానిక తెలుగు కుటుంబాల వారు తీవ్ర సంతాపం వ్యక్తపరుస్తున్నారు. స్థానికంగా ఉన్న తానా సభ్యులు మృతుల కుటుంబాలకు సహాయ సహకారాలు అందిస్తున్నారు.