NRI-NRT

WETA. మేరీ ల్యాండ్ లో మాతృమూర్తికి నీరాజనం.

WETA. మేరీ ల్యాండ్ లో మాతృమూర్తికి నీరాజనం.

విమెన్ ఎంపవర్మెంట్ తెలుగు అసోసియేషన్ (WETA) వారు ఆధ్వర్యంలో మే 6, 2023 న మేరీల్యాండ్ లో జరిగిన అంతర్జాతీయ మాతృ దినోత్సవం(మదర్స్ డే) వేడుకలు చాలా ఘనంగా జరిగాయి. ఈ అవనిలో దేవుడు ఎన్నో అద్భుతాలు సృష్టించాడు. అందులో అనిర్వచనీయమైన, అవధులు లేని, అపురూపమైన ప్రేమ ఏదైనా ఉంది అంటే అది ఒక అమ్మ ప్రేమ మాత్రమే…విచ్చేసిన మాతృమూర్తులందరికి మాతృ దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతూ జ్యోతి ప్రజ్వలన తో ఈ వేడుకలను ప్రారంభించారు. దాదాపుగా 600 మంది ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.

ఈ వేడుకలకు ముఖ్య అతిధి గా మేరీల్యాండ్ లెఫ్టినెంట్ గవర్నర్ అరుణా మిల్లర్ తన మాతృమూర్తి మరియు 2 కౌన్సిల్‌మెన్ హాజరైయ్యారు. వివిధ రంగాల్లో సేవలు అందిస్తున్న మాతృమూర్తుల ప్రసంగాలతో పాటు అనేక సాంస్కృతిక ప్రదర్శనలు తెలుగు ప్రవాస మహిళలను ఉత్తేజపరిచాయి.

WETA స్థాపకురాలు ఝాన్సీ ఈ కార్యక్రమంలో పాల్గొన్న అతిధులకు పురస్కారాలు అందజేసిన అనంతరం ప్రసంగిస్తూ WETA సంస్థ మహిళలకు ఇస్తున్న ప్రాధాన్యత, మహిళా సాధికారతకు, అభ్యున్నతికి WETA అధ్వర్యంలో చేపట్టిన ప్రణాళికలను వివరించారు.

ప్లే బ్యాక్ సింగర్ విజయలక్ష్మి తన మధురమైన గానం తో ప్రేక్షకులకు ఆనందాన్ని అందించారు. యాంకర్ శ్రావ్య మానస తన వాక్చాతుర్యంతో అందరితో ఆడుతు పాడుతు కార్యక్రమాన్ని ఎంతో రక్తి కట్టించారు. వీటితో పాటుగా కూచిపూడి నృత్య ప్రదర్శనలు మరియు టాలీవుడ్, బాలీవుడ్ డ్యాన్స్‌తో కూడిన ఈవెంట్ అనేక గేమ్స్ మరియు రాఫెల్స్ కి గిఫ్ట్స్ అందిస్తూ భారీ విజయాన్ని సాధించింది. రుచికరమైన ఆహారాన్ని అందించారు.

WETA అధ్యక్షురాలు శైలజ రెడ్డి మాట్లాడుతూ అందరూ కలిసి కట్టుగా సంస్థకు కృషి చేస్తే ఎంతో మంది మహిళలకు సేవలను అందించగలరు అని చెప్పారు. బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ప్రీతి రెడ్డి(MD), జయశ్రీ తేలుకుంట్ల(VA), కల్చరల్ చైర్ చైతన్య పోలోజు, మీడియా కో-చైర్ లక్ష్మీ లావణ్య తేలు, DC ఏరియా స్పాన్సర్ చైర్ స్వరూప సింగరేసు, DC ఏరియా రీజినల్ చైర్ ప్రత్యూష నారపరాజు, సోషల్ మీడియా చైర్ సునీత గంప గార్లతో కలిసి సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించారు. ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యులకు , వాలంటీర్స్ కు కృతజ్ఞతలు తెలిపారు.