హాజరవుతున్న ప్రియాంక గాంధీ
సరూర్ నగర్ స్టేడియంలో నిరుద్యోగుల బహిరంగ సభ
మధ్యాహ్నం 3.30 గంటలకు శంషాబాద్ చేరుకోనున్న ప్రియాంక
ప్రత్యేక హెలికాప్టర్ లో సరూర్ నగర్ పయనం
సరూర్ నగర్ సభలో యూత్ డిక్లరేషన్ ప్రకటించనున్న ప్రియాంక
హైదరాబాద్ : కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ నేడు హైదరాబాద్ పర్యటనకు వస్తున్నారు. సరూర్ నగర్ స్టేడియంలో కాంగ్రెస్ పార్టీ నిరుద్యోగులతో నిర్వహించే యువ సంఘర్షణ సభకు ఆమె హాజరుకానున్నారు. ప్రియాంక సోమవారం మధ్యాహ్నం 3.30 గంటలకు శంషాబాద్ చేరుకుంటారు. అక్కడ్నించి ప్రత్యేక హెలికాప్టర్ లో సరూర్ నగర్ పయనమవుతారు. సాయంత్రం 4.30 గంటలకు సరూర్ నగర్ సభలో ప్రియాంక ప్రసంగిస్తారు. సాయంత్రం 5 గంటలకు ప్రియాంక గాంధీ సభ నుంచి తిరుగు పయనమవుతారు. ప్రియాంక పర్యటనపై సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క స్పందించారు. నిరుద్యోగుల బహిరంగ సభలో ప్రియాంక గాంధీ యూత్ డిక్లరేషన్ ప్రకటిస్తారని వెల్లడించారు.