Politics

పోలవరం ముంపుపై తక్షణమే సర్వే చేసేలా ఆదేశించండి

పోలవరం ముంపుపై తక్షణమే సర్వే చేసేలా ఆదేశించండి

సీడబ్లూసీ ఛైర్మన్​కు తెలంగాణ సర్కార్​ లేఖ

హైదరాబాద్ : పోలవరం ప్రాజెక్టు ముంపుపై తక్షణమే సర్వే చేపట్టేలా చూడాలని సీడబ్లూసీ ఛైర్మన్​కు తెలంగాణ సర్కార్​ లేఖ రాసింది. సుప్రీంకోర్టు నిర్ణయించిన గడువులోగా పీపీఏ ఆధ్వర్యంలో సర్వే నిర్వహించాలని కోరింది. ఆంధ్రప్రదేశ్​ను భాగస్వామిగా చేసినా, చేయకపోయినా ప్రక్రియ పూర్తి చేయాలని లేఖలో విజ్ఞప్తి చేసింది