దుబాయి మరియు ఇతర ఏమిరేట్లలలో నివసిస్తున్న తెలుగు ప్రవాసీయులు శ్రీ సత్యనారాయణ స్వామి సాముహిక వ్రతాన్ని ఆదివారం అత్యంత భక్తి శ్రధ్ధలతో నిర్వహించారు. అజ్మాన్ లో జరిగిన జరిగిన వేదిక వాకిట్లో గోవు పేడ అలకకున్నా బియ్యం పిండితో వేసిన ముగ్గుల నుండి మోదలు కలశం చెంబు మరియు మామిడాకుల వరకు సంప్రదాయకబద్దంగా దుబాయి రెడ్డి సమాజం నిర్వహించిన శ్రీ సత్యనారాయణ స్వామి సాముహిక వ్రత పూజ కార్యక్రమంలో విభిన్న వర్గాలకు చెందిన దంపతులు పాల్గోని అధ్యాత్మికతో పరవశించిపోయారు.
తెలుగు ప్రవాసీ ప్రముఖుడు ప్రస్నన్న సోమిరెడ్డి – తనుజ దంపతులు ముందుగా పసుపు గణపతి పూజ ద్వార ప్రారంభించిన కార్యక్రమం భక్తులకు ప్రసాదం పంపిణీ చేసే వరకు అచ్చం అన్నవరంలో అన్నట్లుగా జరిగింది. కార్యక్రమంలో పాల్గోన్న దంపతులందరికి రాగి పాత్ర నూతన వస్త్రాలు, కొబ్బరికాయలు, అరటి, మామిడి, ఆకులు మోదలగు అన్నింటిని నిర్వహకులు సమకూర్చారు. దుబాయిలో ఉండె పూజరి ప్రవీణ్ నేతృత్వంలో అర్చకులు వేదమంత్రాలతో అశ్వీరదించి, స్వామి వారి ప్రసాదాన్ని అందించారు. అటు దుబాయితో పాటు అటు స్వరాష్ట్రంలో కూడ కష్టనష్టాలు తొలగిపోయి సర్వత్రా విజయం చేకూరాలని ప్రార్ధించారు.
బ్రహ్మానందరెడ్డి – జ్యోతి, శ్యాంసురేంద్ర రెడ్డి – శ్రీ దేవి, వెంకట రమణ – శాంతి ప్రియ, తిరుపతి రెడ్డి – సుమజ, విజయ – మహితరెడ్డి , రమేష్ రెడ్డి – సుధీర, సుబ్బారెడ్డి – సుభాషిణి దంపతులతో పాటు జి.రెడ్డయ్య రెడ్డి, సత్యనారాయణ రెడ్డిలు ఈ కార్యక్రమ నిర్వహణను సమన్వయం చేసారు.
వీరు దుబాయి నగరంలో గత ఏడు సంవత్సరాల నుండి శ్రీ సత్యనారాయణ స్వామి సాముహిక వ్రతాన్ని నిర్వహిస్తున్నారు.