వైసీపీ సర్కారు ‘జగనన్నకు చెబుదాం’ అనే కార్యక్రమాన్ని తీసుకురావడంపై ఆయన విమర్శనాస్త్రాలు సంధించారు. జగనన్నకు చెప్పుకోవడం, చెవిటి వాడి ముందు శంఖం ఊదడం రెండూ ఒకటేనని అన్నారు. జగనన్నకు చెబుదాం టోల్ ఫ్రీ నెంబర్ డయల్ చేస్తే, జగనన్న చెప్పే అబద్ధాలు మెసేజ్ ల రూపంలో వస్తాయని సత్యకుమార్ తెలిపారు. కోట్ల రూపాయల ప్రజాధనం దుర్వినియోగం చేయడం తప్ప, సమస్యల పరిష్కారం ఉత్తిమాటేనని విమర్శించారు. జగనన్నే అసలు సమస్య అయినప్పుడు, ఇక జగనన్నకు చెబుదాం అనేది అర్థరహితమని అన్నారు