తనపై పోలీసులకు ఫిర్యాదు చేయడంపై జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి (Muthireddy Yadagiri Reddy) తీవ్ర వేదనకు గురయ్యారు. తన సంతకాన్ని తండ్రి ఫోర్జరీ చేసి.. సిద్ధిపేట జిల్లా చేర్యాలలో తన పేరిట ఉన్న భూమిని ఆయన పేరు మీదకు మార్చుకున్నారని ముత్తిరెడ్డి కుమార్తె భవానీ.. ఉప్పల్ ఠాణాలో ఇటీవల ఫిర్యాదు చేశారు. కుమార్తె ఫిర్యాదుపై ఎమ్మెల్యే తాజాగా స్పందించారు. తనను రాజకీయంగా ఎదుర్కోలేక.. తన బిడ్డను రాజకీయ ప్రత్యర్ధులు వాడుకుంటున్నారని వాపోయారు. ప్రతి కుటుంబంలో సమస్యలు ఉంటాయని.. వాటిని ఇంట్లోనే తేల్చుకుంటామని చెప్పారు. చేర్యాలలో 1200 గజాల భూమి తన బిడ్డ పేరుపైనే ఉందని.. ఎటువంటి ఫోర్జరీ జరగలేదని ఎమ్మెల్యే కన్నీటి పర్యంతమయ్యారు.