Agriculture

అమరావతి R5 జోన్‌ రగడలో కొత్త వివాదం.. హద్దురాళ్లు తొలగించిన స్థానికులు..

అమరావతి R5 జోన్‌ రగడలో కొత్త వివాదం.. హద్దురాళ్లు తొలగించిన స్థానికులు..

హైకోర్టు ఆదేశాల తర్వాత అమరావతిలోని R5 జోన్‌లో పేదలకు ఇళ్ల పట్టాలు ఇచ్చే పనులు వేగవంతం చేసింది ప్రభుత్వం..

మొత్తం 11వందల 34 ఎకరాలను ఈ జోన్‌ కోసం కేటాయించారు. వీటిల్లోనే పేదలకు ఇళ్లపట్టాలు ఇస్తారు. ఒకవైపు లేఅవుట్‌ పనులు శరవేగంగా జరుగుతుంటే.. ఇంకోవైపు స్థానికుల నుంచి నిరసనలు తప్పడం లేదు..

మంగళగిరి మండలం కురగల్లులో R5 జోన్‌ హద్దురాళ్లను స్థానికులు తొలగించారు. నిన్న కురగల్లుతోపాటు.. నవులూరు, యర్రబాలెం, నిడమర్రు, కృష్ణాయపాలెంలో అధికారులు పర్యటించి.. అక్కడ భూమిని చదును చేశారు. హద్దురాళ్లు పాతారు. త్వరలోనే CRDA పరిధిలో కేటాయించిన ఈ భూముల్లో గుంటూరు, విజయవాడ పరిధిలోని పేదలకు ఇళ్ల పట్టాలు ఇవ్వాలన్నది ప్రభుత్వం ఆలోచన. అయితే కురగల్లులో హద్దురాళ్లు తొలగించడంతో కలకలం రేగుతోంది..
☝️అమరావతి రైతులు ఆంధ్ర గవర్నర్ గారి ఇంటివద్ద , సుప్రీం కోర్ట్ చీఫ్ గారి ఇంటి వద్ద , ప్రధాని గారి ఇంటివద్ద జగన్మోహ న రెడ్డి అరాచకాలపై వినతి పత్రం ఇద్దాం . సన్నద్ధం కండి . #🔥RRR