Business

నష్టాల్లో స్టాక్ మార్కెట్లు…

నష్టాల్లో స్టాక్ మార్కెట్లు…

దేశీయ స్టాక్ మార్కెట్లు నిన్న ఫ్లాట్ ముగింపు తర్వాత నేడు నష్టాలతో కొనసాగుతున్నాయి. అమెరికా మార్కెట్లు నష్టాల్లో ముగియటం మన మార్కెట్లపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తోందని నిపుణులు చెబుతున్నారు.

ఉదయం 9.56 గంటల సమయంలో బెంచ్ మార్క్ సూచీ సెన్సెక్స్ 85 పాయింట్లు నష్టపోగా.. మరో కీలక సూచీ నిఫ్టీ 24 పాయింట్లు కోల్పోయింది. ఇదే సమయంలో నిఫ్టీ బ్యాంక్ సూచీ 185 పాయింట్లు, నిఫ్టీ మిడ్ క్యాప్ సూచీ 110 పాయింట్ల నష్టంలో కొనసాగుతున్నాయి. ప్రధానంగా బ్యాంకింగ్ స్టాక్స్ మార్కెట్లను నష్టాల్లోకి డ్రాగ్ చేశాయి.

ప్రధానంగా అమెరికాలో విడుదల కానున్న ద్రవ్యోల్బణం డేటా, రుణ పరిమితిపై అగ్ర నాయకుల మధ్య జరగనున్న చర్చల నేపథ్యంలో మార్కెట్లు నష్టాల్లో ముగిశాయి. లేబర్ డిపార్ట్‌మెంట్ వినియోగదారుల ధరల సూచిక(సీపీఐ) నివేదికను అనుసరిస్తూ ద్రవ్యోల్బణం తగ్గుముఖం పడుతుందా లేదా అనేదానిపై ఇన్వెస్టర్లు పరిశీలిస్తున్నారు.

NSE సూచీలో ఇండస్ ఇండ్ బ్యాంక్, బ్రిటానియా, పవర్ గ్రిడ్, హెచ్డీఎఫ్సీ లైఫ్, ఓఎన్జీసీ, హిందుస్థాన్ యూనీలివర్, టాటా మోటార్స్, బజాజ్ ఆటో, నెస్లే, రిలయన్స్, అల్ట్రాటెక్ సిమెంట్, అదానీ ఎంటర్ ప్రైజెస్, బిపిసీఎల్, అపోలో హాస్పిటల్స్, ఎస్బీఐ లైఫ్, ఐటీసీ, విప్రో కంపెనీల షేర్లు లాభాల్లో కొనసాగుతూ టాప్ గెయినర్స్ గా ఉన్నాయి.