* కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీదే పైచేయి
పీపుల్స్‌పల్స్- సౌత్‌ఫస్ట్ ఎగ్జిట్‌పోల్‌లో వెల్లడి
– కర్ణాటకలో జరిగిన శాసనసభ ఎన్నికల్లో ‘కాంగ్రెస్ పార్టీదే హవా’ అని పీపుల్స్ పల్స్ సంస్థ – సౌత్‌ఫస్ట్ నిర్వహించిన ఎగ్జిట్ పోల్ సర్వేలో వెల్లడయింది.
– పీపుల్స్‌పల్స్ సంస్థ నిర్వహించిన ఎగ్జిట్ పోల్ సర్వే ప్రకారం కాంగ్రెస్ పార్టీకి 107-119, బిజెపికి 78-90, జేడీ(ఎస్)కు 23-29, ఇతరులకు 1-3 సీట్లు వచ్చే అవకాశం ఉంది. మార్జిన్ ఆఫ్ ఎర్రర్ ప్లస్ ఆర్ మైనస్ 2 శాతం.
– కర్ణాటకలో అధికారపీఠం కైవసం చేసుకోవాలంటే 113 సీట్లు గెలవాలి – పీపుల్స్‌పల్స్
– పీపుల్స్‌పల్స్ సంస్థ నిర్వహించిన ఎగ్జిట్ పోల్ సర్వే ప్రకారం కాంగ్రెస్-బిజెపి మధ్య ఓట్ల వ్యత్యాసం 6 శాతం ఉండే అవకాశం ఉంది.
– పీపుల్స్‌పల్స్ ఎగ్జిట్ పోల్ సర్వే ప్రకారం కాంగ్రెస్ పార్టీకి 42 శాతం, బిజెపికి 36 శాతం, జేడీ(ఎస్)కు 16 శాతం అవకాశం ఉంది. మార్జిన్ ఆఫ్ ఎర్రర్ ప్లస్ ఆర్ మైనస్ 2 శాతం.
– 2018 ఎన్నికలతో పోల్చి చూస్తే ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 4 శాతం ఓట్లను అధికంగా పొందుతుండగా, బిజెపి 0.35 శాతం, జేడీ(ఎస్) 2.3 శాతం ఓట్లను కోల్పోయే అవకాశాలు ఉన్నట్టు పీపుల్స్‌పల్స్ ఎగ్జిట్ పోల్ సర్వేలో వెల్లడైంది.
– ముఖ్యమంత్రిగా ఎవరుండాలని అడిగితే మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య అని 42 శాతం మంది, ప్రస్తుత ముఖ్యమంత్రి బస్వరాజ్ బొమ్మై అని 24 శాతం, మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి అని 17 శాతం, మాజీ సీఎం బి.యడియూరప్ప అని 14 శాతం మంది, డి.కె.శివకుమార్ అని 3 శాతం మంది కోరుకుంటున్నారు – పీపుల్స్‌పల్స్
– కర్ణాటకలోని మొత్తం 6 రీజియన్లలలో ఐదింటిలో కాంగ్రెస్ ముందంజలో ఉండగా కోస్తా కర్ణాటకలో మాత్రం బిజెపి ముందంజలో ఉంది.
– ముంబాయి కర్ణాటకలో కాంగ్రెస్ బిజెపిపై స్వల్ప ఆధిక్యత కనబరుస్తోంది.
– ఓల్డ్ మైసూర్‌లో కాంగ్రెస్ జెడి(ఎస్) పై స్వల్ప ఆధిక్యత కనబరుస్తోంది.
– బిజెపికి మరొకసారి అవకాశం ఇస్తారా అని అడగ్గా 53 శాతం ఇవ్వమని, 41 శాతం ఇస్తామని, 6 శాతం ఏమీ చెప్పలేమని సమాధానం ఇచ్చారు – పీపుల్స్‌పల్స్
– కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన ఆకర్షనీయమైన మేనిఫెస్టో వల్ల ఆ పార్టీకి లాభం చేకూరింది – పీపుల్స్‌పల్స్
– కాంగ్రెస్ అగ్రనాయకుడు రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర కర్ణాటకలో కొంతవరకు ప్రభావం చూపగలిగింది – పీపుల్స్‌పల్స్
– నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదల, నిరుద్యోగం, గ్రామీణ ప్రాంతాల్లో రోడ్ల దుస్థితి, పట్టణ ప్రాంతాలలో మంచినీటి సమస్య తదితర అంశాలపై అధికార బిజెపి పై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉంది. ఈ వ్యతిరేకత కారణంగానే బిజెపి అధికారం కోల్పోయే అవకాశాలు కనబడుతున్నాయి – పీపుల్స్‌పల్స్
– ప్రధానంగా గ్యాస్ సిలిండర్ ధరల పెరుగుదల ఎన్నికల్లో తీవ్ర ప్రభావం చూపింది.
– కర్ణాటకలో అధికార బిజెపి పార్టీపై ప్రభుత్వ ఉద్యోగులు పూర్తి వ్యతిరేకంగా ఉన్నారు. ముఖ్యంగా పాత పెన్షన్ పథకం అమలుకు ప్రభుత్వ ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు – పీపుల్స్ పల్స్
– ప్రస్తుత బీజేపీ ప్రభుత్వంలోని అవినీతిని ఎండగడుతూ చేసిన ‘40% సర్కారు’ కమీషన్ నినాదం ద్వారా కాంగ్రెస్ రాష్ట్ర ప్రజల్ని చ్కెతన్యపరచగలిగింది – పీపుల్స్‌పల్స్
– అధికార బిజెపి నుంచి పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీలో చేరడం వల్ల బీజేపీకి నష్టం జరిగింది- పీపుల్స్‌పల్స్
– కాంగ్రెస్ జాతీయ అధ్యక్షులు మల్లిఖార్జున్ ఖర్గే ప్రభావంతో ఎస్సీలు కాంగ్రెస్ వైపు నిలిచారు. – పీపుల్స్‌పల్స్
– బీజేపీ లేవనెత్తిన జై బజరంగ్‌బలి, టిప్పు సుల్తాన్, ఈద్గా మైదాన్ వంటి … వివాదాస్పద అంశాలు ప్రజలపై ప్రభావం చూపలేకపోయాయి – పీపుల్స్‌పల్స్
– ముస్లిం రిజర్వేషన్ల ఎత్తివేత వల్ల ముస్లింలు ఏకపక్షంగా కాంగ్రెస్ పార్టీకి దగ్గరయ్యారు -పీపుల్స్ పల్స్
– పీపుల్స్‌పల్స్ సంస్థ ఎగ్జిట్ పోల్ సర్వేను రాష్ట్రంలోని 56 అసెంబ్లీ నియోజకవర్గాల్లో చేపట్టింది. ప్రతి నియోజకవర్గంలో మూడు పోలింగ్ స్టేషన్లను ఎంపికచేసుకొని, ఒక్కో స్టేషన్లో 15-20 శాంపిల్స్ చొప్పున మొత్తం 3024 శాంపిల్స్‌ను సేకరించింది.
KARNATAKA ASSEMBLY ELECTION 2023 UPDATE
65.69% VOTER’S TURNOUT RECORDED TILL 05.00PM
* DK Shivakumar: కర్నాటకలో గెలుపు మాదే.. 141 సీట్లు గెలిచి తీరుతాం
* యూకే పర్యటనకు బయలుదేరిన మంత్రి కేటీఆర్
తెలంగాణ రాష్ట్రానికి మరిన్ని పెట్టుబడులు ఆకర్షించే లక్ష్యంతో తెలంగాణ పరిశ్రమలు మరియు ఐటి శాఖ మంత్రి కే తారకరామారావు ఈరోజు యూకే పర్యటనకు బయలుదేరారు. ఈరోజు ఉదయం యుకేకు బయలుదేరిన మంత్రి కేటీఆర్ 13వ తేదీ వరకు తన పర్యటనను కొనసాగిస్తారు. మంత్రి కేటీఆర్ తన పర్యటనలో భాగంగా యూకే లోని పారిశ్రామిక దిగ్గజ సంస్థలతోపాటు… వ్యాపార వాణిజ్య సంఘాలతో సమావేశం అయి తెలంగాణ రాష్ట్రంలో ఉన్న పెట్టుబడుల అనుకూల వాతావరణాన్ని వివరిస్తారు.
* 10.05.2023
అమరావతి
రేపు (11.05.2023) సీఎం శ్రీ వైఎస్ జగన్ విశాఖపట్నం పర్యటన
వివిధ అభివృద్ది కార్యక్రమాల ప్రారంభోత్సవం
మధ్యాహ్నం 2 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి 3.20 గంటలకు విశాఖపట్నం చేరుకుంటారు. అక్కడి నుంచి 3.50 గంటలకు పీఎం పాలెం వైఎస్సార్ స్టేడియంకు చేరుకుంటారు, అక్కడ ఏర్పాటు చేసిన వైఎస్సార్ విగ్రహాన్ని ఆవిష్కరిస్తారు. సాయంత్రం 4.50 గంటలకు ఆరిలోవ అపోలో ఆస్పత్రికి చేరుకుని, అపోలో కేన్సర్ ఆస్పత్రిని ప్రారంభిస్తారు. కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రసంగించిన అనంతరం అక్కడి నుంచి బయలుదేరి 5.50 గంటలకు బీచ్ రోడ్డుకు చేరుకుంటారు, అక్కడ వీఎంఆర్డీఏ అభివృద్ది చేసిన సీ హారియర్ యుద్ద విమాన మ్యూజియంను ప్రారంభిస్తారు. దీంతోపాటు అక్కడి నుంచే రామ్‌నగర్‌లోని వీఎంఆర్డీఏ కాంప్లెక్స్, ఎంవీపీలోని ఇండోర్ స్పోర్ట్స్ ఎరీనాను ప్రారంభించనున్నారు. అనంతరం ఎండాడలోని కాపు భవనం, భీమిలిలోని ఫిష్ ల్యాండింగ్ సెంటర్‌కు శంకుస్ధాపన చేయనున్నారు. అక్కడి నుంచి 6.15 గంటలకు బీచ్ రోడ్డులోని ఏయూ కన్వెన్షన్ హాల్లో జరుగుతున్న ఎమ్మెల్యే గొల్ల బాబురావు కుమారుడి వివాహ రిసెప్షన్ వేడుకలో పాల్గొంటారు, అనంతరం రాత్రి 7 గంటలకు తిరుగు ప్రయాణమై 8.20 గంటలకు తాడేపల్లి నివాసానికి చేరుకుంటారు.
* TS – SSC RESULTS
||తెలంగాణ టెన్త్ ఫలితాలు విడుదల.||
⚪ తెలంగాణ
◻️86.60 శాతం ఉత్తీర్ణత.
బాలికలు 88.53 శాతం,
బాలురు 84.68 శాతం ఉత్తీర్ణత.
– 2793 పాఠశాలల్లో 100 శాతం ఉత్తీర్ణత.
◻️ 25 స్కూళ్లలో సున్నా శాతం ఫలితాలు.
– 99 శాతంతో ప్రథమ స్థానంలో నిర్మల్.
– 59.46 శాతంతో చివరి స్థానంలో వికారాబాద్
* BIG BREAKING NEWS
పులివెందుల తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ బీటెక్ రవి గారి మీద చక్రాయపేటలొ పెట్టిన అక్రమ కేసులో ముందస్తు బెయిల్ మంజూరు చేసిన ఆంధ్రప్రదేశ్ హైకోర్టు.
* జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు రాజమండ్రి రూరల్ నియోజకవర్గంలోని కడియం ఆవలో అకాల వర్షాలతో పంటలు దెబ్బ తిన్న రైతాంగాన్ని పరామర్శించి, మొలకలు వచ్చిన ధాన్యాన్ని పరిశీలించారు.
#JSPWithAPFarmers
* వివేకా హత్య కేసులో మళ్లీ సుప్రీంకోర్టుకు సునీతారెడ్డి – గంగిరెడ్డి బెయిల్ రద్దు ఉత్తర్వుల్లో షరతులను సుప్రీంలో సవాల్ చేసిన సునీతరెడ్డి – జూలై 1న గంగిరెడ్డిని బెయిల్‌పై విడుదల చేయాలని హైకోర్టు తీర్పు – హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టులో సవాల్ చేసిన సునీతారెడ్డి
ఏపీ :
రేపు అల్లూరి జిల్లా రాజవొమంగి, అనకాపల్లి జిల్లా నాతవరం,కాకినాడ జిల్లా కోటనందూరు మండలంలో తీవ్రవడగాల్పులు వీచే అవకాశం ఉంది.
రేపు 45,ఎల్లుండి 104 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉంది.
మిగిలిన చోట్ల ఎండ ప్రభావం చూపే అవకాశం ఉంది.
ప్రజలు ఎండ తీవ్రత పట్ల అప్రమత్తంగా ఉండాలి.
◾ || ఎన్నికల సిబ్బందిపై దాడి || ◾
▪️బస్వన్ బాగే వాడి నియోజక వర్గంలో ఘటన.
▪️కర్ణాటక – విజయపుర మాసబైనాలలో ఎన్నికలు జరుగుతుండగా ఈవీఎంలు మరియు కంట్రోల్ యూనిట్లను అనుమానాస్పదంగా తరలిస్తున్న కొందరిని పట్టుకొని చితకబాదిన స్థానిక ప్రజలు.
◾ || ఆర్టీసీ బస్సులో మహిళలు ఘర్షణ … బస్సు కు పోలీస్ వాహనం అడ్డు పెట్టి బస్సులోకి ఎస్ఐ … విద్యార్థినితో అసభ్యంగా ప్రవర్తన || ◾
▪️ సిద్దిపేట
▪️ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తున్నా విద్యార్థిని జగిత్యాల పోలీస్ వాహనం అడ్డం పెట్టి బస్సులోని కి అక్రమంగా ప్రవేశించి ఈ విద్యార్థిని పట్ల అమర్యాద కరంగా బాధ్యాత రహితంగా కొట్టి అందరి ముందు అవమానకర పరచిన జగిత్యాల టౌన్ SI.
▪️జగిత్యాల్ రూరల్ సబ్-ఇన్‌స్పెక్టర్ అనిల్ ముస్లిం విద్యార్థినితో అసభ్యంగా ప్రవర్తించాడని ఆరోపించారు.
▪️రన్నింగ్ బస్ నుండి ఆమెను బయటకు లాగాడని ఆమె ఆరోపించింది.
▪️ఆ సబ్-ఇన్‌స్పెక్టర్ తనతో అసభ్యంగా ప్రవర్తించిన వీడియోను రికార్డ్ చేస్తుండగా అమ్మాయి మొబైల్ లాగేసుకున్నారు అనీ మహిళ ఏడుస్తూ పోలీస్ స్టేషన్ బయట కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.
▪️ పూర్తీ వివరాలు ఇంకా తెలియాల్సి వుంది.