🍥శంకరపట్నం, న్యూస్టుడే: కరీంనగర్ జిల్లా కేశవపట్నం ఆదర్శ పాఠశాలలో చదువుతున్న సోదరీమణులు గంప శార్వాణి, ప్రజ్ఞాని పదో తరగతి పరీక్షల్లో 10కి 10 జీపీఏ సాధించి ప్రతిభ చాటారు. కేశవపట్నం గ్రామానికి చెందిన తల్లి గంప కవిత, తాత అల్లెంకి వీరేశం సంరక్షణలో వీరు ఒకటి నుంచి అయిదో తరగతి వరకు స్థానిక ప్రైవేటు స్కూల్లో చదవగా.. ఆరు నుంచి పదో తరగతి వరకు ఆదర్శ పాఠశాలలో చదివారు. భవిష్యత్తులో కలెక్టర్ అవటమే లక్ష్యమని శార్వాణి, డాక్టర్ అవుతానని ప్రజ్ఞాని పేర్కొన్నారు.
కవలలు.. ‘పది’లో మెరిశారు
